Wednesday, August 5, 2026 10:08 AM
Wednesday, August 5, 2026 10:08 AM

ఒంటరైన రఘురామ..?

రఘురామ కృష్ణం రాజు.. ఏపీ డిప్యూటి స్పీకర్. ఈ పేరు వినగానే మన కళ్ళ ముందు చాలా అంశాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. వైసీపీలో ఉంటూనే ఆ పార్టీ అధినేతపై ఒంటరి పోరాటం, ఎవరికీ భయపడకుండా విమర్శలు, అరెస్ట్ కావడం, కస్టడీలో ఇబ్బందులు ఇవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. కూటమి ప్రభుత్వంలో డిప్యూటి స్పీకర్ కావడం, ఆ తర్వాత కూడా జగన్ ను టార్గెట్ చేయడం వంటివి జరిగాయి. అయితే ఇప్పుడు మాత్రం ఆయనకు పార్టీలో, ప్రభుత్వంలో సహకారం లేదనే కామెంట్ వినపడుతోంది.

Also Read : మెడికల్ కాలేజీల టెండర్లు.. బిగ్ ట్విస్ట్..!

టీడీపీలో ఆయన ఒంటరి రాజు గారు అయ్యారు అనే కామెంట్స్ వినపడుతున్నాయి. డిఎస్పీ జయసూర్య వ్యవహారంలో, ఐపీఎస్ సునీల్ వ్యవహారంలో ఎదురుదెబ్బలు తగిలాయి అనే కామెంట్స్ వినపడుతున్నాయి. పీవీ సునీల్ పై చర్యలకు రఘురామ కృష్ణంరాజు పట్టుబట్టినప్పటికీ పని జరగలేదు. సునీల్ కుమార్ పై డీజీపీకి ఫిర్యాదు చేసినా.. అనుకున్న లక్ష్యాన్ని రఘురామ సాధించలేదు అనే అభిప్రాయాలు వినిపించాయి. ఇక డిఎస్పీ జయసూర్య వ్యవహారంలో.. రఘురామ మాట చెల్లలేదు.

Also Read : దుమారం రేపుతున్న దీపక్ వ్యాఖ్యలు..!

డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ దూకుడుగా వెళ్ళడం, ఆయన విషయంలో సిఎం కూడా సీరియస్ కావడంతో.. పోలీస్ శాఖ బదిలీ చేయక తప్పలేదు. కొత్తగా భీమవరం డిఎస్పీగా మరొకరిని నియమించారు. ఈ రెండు వ్యవహారాల్లో కూడా రఘురామ మాట చెల్లలేదు. దీనికి తోడు సుప్రీం కోర్ట్ షాక్ ఇచ్చిన తర్వాత.. సోషల్ మీడియాలో పీవీ సునీల్ వరుస పోస్ట్ లు పెడుతూ విమర్శలు చేస్తున్నారు. బ్యాంకులకు రుణాల ఎగవేతపై వరుస కౌంటర్లు వేస్తున్నారు. అయినప్పటికీ రఘురామకు పార్టీ నుంచి మద్దతు కరువైంది. అటు సోషల్ మీడియాలో కూడా ఇది రఘురామ వర్సెస్ పీవీ సునీల్ కు సంబంధించి వ్యవహారంగానే చూస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్