Thursday, May 7, 2026 07:04 AM
Thursday, May 7, 2026 07:04 AM

తమ సత్తా ఏంటో చూపించిన రోకో..!

కొంతమందికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది.. ఒక రంగంలో తమకున్న ఫ్యాషన్ నిరూపించుకోవడానికి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఈ జాబితాలో ముందుంటారు స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. గత ఏడాదికాలంగా వీరిద్దరి విషయంలో జరుగుతున్న రాజకీయం ఏంటి అనేది చాలామంది అభిమానులకు క్లారిటీ ఉంది. క్రికెట్ వార్తలను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి కూడా.. దీనిపై అవగాహన ఉంది. వీళ్ళిద్దరూ దేశవాళి క్రికెట్ ఆడాల్సిందే అనే డిమాండ్లు కూడా వినిపించాయి. టీమ్ ఇండియా యాజమాన్యం ఒత్తిడి పెంచే ప్రయత్నం కూడా చేసింది.

Also Read : బెర్లిన్ లో రాహుల్ బాంబులు.. సంచలన ఆరోపణలు..!

దీనితో ఈ ఏడాది మొదట్లో ఇద్దరు.. డొమెస్టిక్ క్రికెట్ ఆడే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో ఇద్దరు పాల్గొన్నారు. ఇద్దరు సెంచరీలతో చెలరే గారు. సిక్కింతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గతంలో ఏ విధంగా అయితే రోహిత్ ఆడేవాడో అదే ప్రదర్శన సిక్కిం జరిగిన మ్యాచ్లో చేశాడు రోహిత్. ఈ మ్యాచ్ లో మొత్తం 155 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. ఆది నుంచి దూకుడుగా ఆడుతూ కేవలం 94 బంతుల్లోనే 155 పరుగులు సాధించాడు. ఇందులో తొమ్మిది సిక్స్ లు, 18 ఫోర్లు ఉన్నాయి.

Also Read : కొంప ముంచుతున్న టీడీపీ పిఏలు..?

అటు విరాట్ కోహ్లీ కూడా ఇదే స్థాయిలో ఆడే ప్రయత్నం చేశాడు. ఆంధ్ర తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఫీట్ అందుకున్నాడు. వేగంగా డొమెస్టిక్ క్రికెట్లో 16 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో 58వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఆస్ట్రేలియా పర్యటనలో చివరి వన్డే తర్వాత నుంచి ఫామ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. సౌత్ ఆఫ్రికా తో జరిగిన సిరీస్ లో రెండు సెంచరీలు.. ఓ అర్థ సెంచరీ సాధించాడు. ఇక ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్లో మరో సెంచరీ చేశాడు. కోహ్లీ ఫార్మ్ చూస్తుంటే విజయ్ హజారే ట్రోఫీలో తదుపరి జరగబోయే మ్యాచ్లలో భారీగానే పరుగులు చేసే సంకేతాలు కనబడుతున్నాయి. ఈ టోర్నీలో మొత్తం పది మ్యాచ్లకు తాను అందుబాటులో ఉంటానని చెప్పాడు కోహ్లీ.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్