Saturday, September 19, 2026 06:43 AM
Saturday, September 19, 2026 06:43 AM

చరిత్ర సృష్టించిన సీఎం చంద్రబాబు

2024 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు.. నూతన సంస్కరణలకు చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు. ఇదే క్రమంలో సంక్షేమ కార్యక్రమాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వైసీపీ ప్రభుత్వంలో పడకేసిన ఆదాయ వనరులను.. గాడిలో పెట్టి ప్రజలకు పంచేందుకు చంద్రబాబు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.

Also Read : సునీల్ లాజిక్.. జగన్‌కు కౌంటర్..!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఎకనామిక్ టైమ్స్ ‘ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రకటించింది. ఇప్పటివరకు ఈ అవార్డు పొందిన ఏకైక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కావడం విశేషం. అవార్డుకు సంబంధించి మంత్రి నారా లోకేష్ ఈరోజు ఉదయం ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. కాసేపటికి క్రితం దీనిపై లోకేష్ మరో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి. సీఎం చంద్రబాబుకు ఈ అవార్డు రావడం రాష్ట్రానికి గర్వకారణం అని కొనియాడారు లోకేష్. రాష్ట్రానికి, మా కుటుంబానికి ఈ అవార్డు ఎంతో ప్రతిష్టాత్మకమన్నారు.

Also Read : పాపం నిధీ.. రాజాసాబ్ హీరోయిన్ కు చుక్కలు..!

సంస్కరణలను సీఎం చంద్రబాబు ధైర్యంగా ముందుకు తీసుకెళ్లారని జ్యూరీ ప్రశంసించిందని లోకేష్ తెలిపారు. పాలనలో సంస్కరణలు, వేగం, విశ్వాసం పై చూపిన నిబద్ధతకి ఈ అవార్డు నిదర్శనం అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, సంస్కరణాత్మక పాలనకు చంద్రబాబు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. సంస్కరణలే మార్గం-పాలనలో విశ్వాసమే మా లక్ష్యం అంటూ లోకేష్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎకనామిక్ టైమ్స్ తమ పత్రికలో ప్రచురించిన కథనాన్ని పోస్ట్ చేశారు లోకేష్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్