Sunday, March 22, 2026 12:37 PM
Sunday, March 22, 2026 12:37 PM

జగన్ గుండెల్లో అమరావతి రైళ్లు.. షాక్ ఇవ్వనున్న కేంద్రం..!

గత పదేళ్ళ కాలంలో దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఏ రాష్ట్ర రాజధాని విషయంలో జరగని దుష్ప్రచారం అమరావతి విషయంలో జరిగిన మాట అక్షర సత్యం. రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ, బీఆర్ఎస్ నేతలు అమరావతి టార్గెట్ గా తమకు నచ్చిన ప్రచారం ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ గ్యాంగ్ లకు ఊహించని షాక్ ఇచ్చే విధంగా కేంద్ర సర్కార్ అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.

Also Read : రూపాయి జీతంతో వందల కోట్లు ప్రజల సొమ్ము వాడేసిన జగనన్న..!

ఏపీ రాష్ట్ర విభజన చట్టం, 2014లోని సెక్షన్ 5(2)కు సవరణ చేసే ప్రక్రియను నరేంద్ర మోడీ సర్కార్ మొదలుపెట్టింది. అసలు ఈ చట్ట సవరణలో ఏ అంశాలు ఉంటాయో ఒకసారి చూస్తే.. ఈ సవరణ ప్రతిపాదనకు ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ఆమోద ముద్ర వేసింది. అనంతరం.. కేంద్ర కేబినేట్ ముందు ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ సవరణ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశ పెట్టి.. అక్కడ ఆమోద ముద్ర పడిన వెంటనే.. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ అంటే.. రాజపత్రం విడుదల చేస్తుంది కేంద్రం.

ఒకసారి నాటి రాష్ట్ర విభజన చట్టంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలు (సెక్షన్ 5) పరిశీలిస్తే.. పార్ట్ 2 కింద 5(1): నిర్ణయించిన తేదీ నుంచి పదేళ్లకు మించకుండా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండనుంది. పార్ట్ 2 కింద 5(2): సబ్ సెక్షన్ 5(1)లో పేర్కొన్న గడువు ముగిసిన తర్వాత తెలంగాణ రాజధానిగా మాత్రమే హైదరాబాద్ ఉంటుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు నూతన రాజధానిని ఏర్పాటు అవుతుంది. ప్రతిపాదిత సవరణ ద్వారా అమరావతిని స్పష్టంగా పేర్కొంటూ విభజన చట్టంలో మార్పులు చేస్తారు.

సవరించిన 5(2): పార్ట్ 2 – 5(2) సబ్-సెక్షన్లో ప్రస్తుతం ఉన్న “ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని ఏర్పాటవుతుంది” అనే వాక్యం స్థానంలో… “అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని ఏర్పాటైంది” అని ప్రస్తావిస్తారు. ఇదంతా చట్టపరమైన వ్యవహారం కాగా.. ఇక్కడ రాజకీయ అంశాలను ఒకసారి పరిశీలిస్తే.. కేబినేట్ లో ఎన్డియే సర్కార్ మాత్రమే దీని గురించి చర్చిస్తుంది. ఎప్పుడైతే పార్లమెంట్ గడప తోక్కుతుందో అక్కడి నుంచి “పాన్ ఇండియా” సినిమా ప్లే అవుతుంది.

Also Read : చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకున్న సిఎం..!

అంటే.. పూర్తి స్థాయిలో అమరావతి గురించి ఉభయ సభల్లో చర్చిస్తారు. అప్పుడు.. 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత హోదాలో జగన్ అమరావతి గురించి ఇచ్చిన హామీలు మొదలు.. వైసీపీ చేసిన పనులు.. అంటే అరటి తోటల దహనం కార్యక్రమం కలుపుకుని.. అమరావతిలో సగం నిర్మాణంలో ఉన్న భవనాలు ఆపడం, రోడ్లు తవ్వడం, కరెంట్ వైర్లు అమ్ముకోవడం వంటివి కలిపి.. మూడు రాజధానులు, ఆ తర్వాత అమరావతిపై చేసిన ప్రచారం.. రిషికొండ వ్యవహారం, అమరావతి ఉద్యమం, పోయిన ప్రాణాలు అన్నీ చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనితో వైసీపీ పెద్దల్లో ఆందోళన మొదలైంది అంటున్నాయి రాజకీయ వర్గాలు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్