Wednesday, February 4, 2026 02:22 PM
Wednesday, February 4, 2026 02:22 PM

వినసొంపుగా స్వచ్ఛమైన తెలుగు టైటిల్స్.. ఈ సంక్రాంతికి..!

సంక్రాంతి అంటేనే తెలుగు వారి పండుగ. అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడే పండుగ. సంక్రాంతి ప్రతి ఒక్కరు తమ సొంత ఊర్లకు వెళ్లి సంబరాలు జరుపుకునే పండుగ. ప్రతి ఇంట్లో పిండి వంటలు, తెలుగుదనం ఉట్టి పడేలా వస్త్రధారణ.. రంగవల్లులు.. బోగి మంటలు, పాడిపంటలు.. ఇవన్నీ కలిస్తేనే తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. అందుకే ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు తెలుగు సినిమాలు కూడా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ ఏడాది కూడా పెద్ద, చిన్న సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవితో నవీన్ పోలిశెట్టి కూడా పోటీ పడుతున్నాడు. అయితే ఇప్పుడు ఒక విషయంపై అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అదేమిటంటే.. సినిమాల పేర్లు. ఈ ఏడాది 5 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అవే ఇప్పుడు హాట్ టాపిక్.

Also Read : ఫిబ్రవరిలోనే ఎంగేజ్మెంట్..? అప్పుడే హింట్ ఇచ్చిన సమంతా..?

సంక్రాంతికి వచ్చే సినిమాల్లో ముందు వరుసలో ఉన్నది ప్రభాస్ హీరోగా వస్తున్న రాజా సాబ్. ఈ సినిమాలో ప్రభాస్ కామెడీ, డెవిల్ క్యారెక్టర్లు పోషించారు. కల్కి సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. జనవరి 9న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే దర్శక నిర్మాతలు ప్రకటించారు. బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ అన్ని సినిమాలు కూడా హిందీ, ఇంగ్లీష్ పేర్లతోనే ఉన్నాయి తప్ప.. తెలుగు పేరు రాలేదు. సాహో, రాథేశ్యామ్, ఆదిపురుష్, సలార్ సీజ్ ఫైర్, కల్కి.. ఇప్పుడు రాజాసాబ్. ఇది పలకడానికి సింపుల్‌గా ఉందంటున్నారు అభిమానులు. ఇక చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా మన శివశంకర వరప్రసాద్. పండగకి వస్తున్నారు అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకులు. సంక్రాంతికి వస్తున్నాం పేరుతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అనిల్.. దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన మీసాల పిల్ల పాట ఇప్పటికే యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. చిరంజీవి అసలు పేరుతో వస్తున్న అచ్చ తెలుసు సినిమా అంటున్నారు దర్శక నిర్మాతలు. విడుదల తేదీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.. కానీ సంక్రాంతికి రావడం మాత్రం పక్కా అంటున్నారు.

ఇక రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలకు దర్శకత్వం వహించిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ సినిమా సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ కోసం రవితేజ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు యాక్షన్ మోడ్‌లోనే వస్తున్న రవితేజ.. చాలా రోజుల తర్వాత ఎంటర్‌టైనర్‌గా వస్తున్నారు. ఇప్పటికే సినిమా టైటిల్‌పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇక మరో హీరో శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి కూడా సంక్రాంతికి వస్తోంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా పడింది. 2017లో శతమానం భవతితో సంక్రాంతి హిట్ అందుకున్న శర్వానంద్.. ఆరేళ్ల తర్వాత సంక్రాంతి రేస్‌లో నిలిచారు. బాలకృష్ణ హీరోగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి తరహాలోనే ఫుల్ లెంగ్త్ కామెడీ ఉంటుందని ఇప్పటికే టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read : ‘అఖండ 2’ ప్రివ్యూ రిపోర్ట్ : బాలయ్య విశ్వరూపం

ఇక మరో కామెడీ సినిమా అనగనగా ఒక రాజు.. నవీన్ పొలిశెట్టి హీరోగా వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే భీమవరం బల్మా పాట సూపర్ హిట్ అయ్యింది. జాతిరత్నాలుతో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న నవీన్.. ఈ సినిమాలో వినోదం, మాస్, కమర్షియల్ సాంగ్స్‌తో సినిమా వస్తుందని భీమవరంలో జరిగిన సినిమా ఈవెంట్‌లో ప్రకటించారు. జనవరి 14న వస్తున్నా.. థియేటర్లలో నవ్వుకుందాం.. అని డేట్ కూడా చెప్పేశారు. అటు విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమాకు కూడా బంధుమిత్రుల అభినందనలతో అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దీంతో స్వచ్ఛమైన తెలుగు టైటిల్స్ వినసొంపుగా ఉన్నాయంటున్నారు తెలుగు ప్రేక్షుకులు. పాన్ ఇండియా పేరుతో ఇంగ్లీష్ పేర్లతో విసిగిపోయిన తెలుగు ప్రేక్షకులు.. 2026 సంక్రాంతి పండుగకు తెలుగుదనం ఉట్టిపడే పేర్లతో వస్తున్న సినిమాల కోసం థియేటర్ల దగ్గర సందడి చేయనున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్