భారత క్రికెట్ మైదానాల విషయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాల మాజీ క్రికెటర్ లు చేసే కామెంట్స్ మనం చూస్తూనే ఉంటాం. మూడు రోజులు లేదా నాలుగు రోజుల్లో ముగిసిపోయే మ్యాచ్ లు అంటూ, స్పిన్ ట్రాక్ లు క్రికెట్ లో మైనస్ అవుతున్నాయని, భారత్ తమకు అనుకూలంగా పిచ్ లను తయారు చేసుకుంటుందని.. భారత్ స్వదేశంలో మాత్రమే పులి అంటూ ఎవరికి నచ్చిన కామెంట్ వారు చేస్తూ ఉంటారు. దానికి తోడు భారత్ లో పేస్ బౌలింగ్ కు అనుకూలంగా ఉండే మైదానాలు లేకపోవడం కూడా వారి వాదనలకు బలం చేకూర్చింది. భారత క్రికెట్ మైదానాల విషయంలో మాట్లాడే మాజీ క్రికెటర్లు.. తమ దేశంలో ఉండే మైదానాల గురించి మాత్రం మాట్లాడే సాహసం చేయరు.
Also Read : గుంటూరులో వైసీపీ భారీ అవినీతి.. కోపరేటివ్ బ్యాంక్ చరిత్రలోనే..!
ప్రస్తుతం యాషెస్ సిరీస్ మొదలైంది. ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా దేశాల మధ్య జరిగే అత్యంత ప్రతిష్టాత్మక టెస్టు సీరిస్ కోసం.. ఈసారి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తోంది. పెర్త్ వేదికగా మొదటి టెస్ట్ శుక్రవారం మొదలు కాగా.. మొదటి రోజునే 19 వికెట్లు నేల కూలాయి. 19 వికెట్లు కూడా పేస్ బౌలర్లకు పడ్డాయి. దీనిపై క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐదు రోజులపాటు మ్యాచ్ లు జరిగే దేశంగా చెప్పుకునే ఆస్ట్రేలియాలో.. టెస్ట్ మూడు రోజులు జరగటం కూడా కష్టంగానే ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో రెండు జట్లు.. వికెట్ కాపాడుకోవడానికి నానా కష్టాలు పడ్డాయి. కనీసం దూకుడుగా ఆడలేని పరిస్థితి.
Also Read : బ్రేకింగ్: ఫార్ములా మొత్తం కేటిఆర్ దే.. ఏసీబీ సంచలనం..!
సాధారణంగా వికెట్లు పడే క్రమంలో ఆటగాళ్లు దూకుడుగా పరుగులు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అది కూడా సాధ్యం కాలేదు మొదటి టెస్ట్ లో. ఇక రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ వెంటనే ఆల్ అవుట్ అయిపోయింది. రెండవ రోజు మొత్తం టీ బ్రేక్ సమయానికి 11 వికెట్లు పడ్డాయి. ఆస్ట్రేలియా ముందు 205 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ నిర్దేశించింది. ఇది చూస్తున్న మాజీ ఆటగాళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భారత్ మైదానాలను విమర్శించేముందు తమ దేశంలో ఉండే పరిస్థితులను చూసుకోవాలని.. 2015 యాషెస్ సీరిస్ లో ఆటగాళ్లు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రపంచం మొత్తం చూసిందని.. నీతులు చెప్పడం మానుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు. మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ దీనిపై సెటైర్ వేశాడు. మొదటిరోజు 19 వికెట్లు పడ్డాయని.. అదే భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే రెండవ టెస్టులో జరిగితే ఏం మాట్లాడతారో చూడాలంటూ కామెంట్ చేశాడు.

