Sunday, March 22, 2026 07:24 AM
Sunday, March 22, 2026 07:24 AM

మాడ్వీ హిడ్మా.. వైలేంట్ హిస్టరీ.. సిఎం అభ్యర్ధినే లేపేసిన చరిత్ర..!

మావోయిస్ట్ లకు వారి పార్టీ చరిత్రలో అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మరణం తర్వాత మరో కీలక నేత మాడ్వీ హిడ్మాను బలగాలు కాల్చి చంపాయి. నేడు ఉదయం 6 – 7 గంటల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో హిడ్మా, అతని భార్య హేమ, మరో నలుగురు అతని టీం సభ్యులను కాల్చి చంపారు. హిడ్మా పూర్తి పేరు ‘మాద్వి హిడ్మా’ అలియాస్‌ సంతోష్‌. ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలోని పూర్వాటి గ్రామంలో జన్మించిన హిడ్మా మావోయిస్ట్ పార్టీ సిద్దాంతంపై పట్టు పెంచుకోలేదు అనే విమర్శలు ఉండేవి.

Also Read : తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం

దాడులే లక్ష్యంగా అతను పని చేయడంతో పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో కమాండర్ గా బాధ్యతలు అప్పగించారు. చత్తీస్ఘడ్, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఝార్ఖండ్, ఒడిస్సా రాష్ట్రాల సరిహద్దుల అడవులపై పూర్తి పట్టు ఉంది. అలాగే హిడ్మాకు హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషలపై పట్టు ఉండటంతో.. దాడుల్లో అతను కీలకంగా వ్యవహరించేవాడు. స్థానిక గిరిజనులతో స్నేహం చేయడంలో కూడా అతను దిట్టగా చెప్తారు. హిడ్మా దళానికి అత్యంత శక్తివంతమైన దళంగా పేరు ఉంది.

25 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన హిడ్మా.. అప్పటి నుంచి గెరిల్లా దాడులే లక్ష్యంగా ఉద్యమంలో కీలకంగా పని చేసి.. కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టాడు. బస్తర్‌ ప్రాంత దళంలో కీలక సభ్యుడిగా ఎదిగిన హిడ్మా.. చిన్న వయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అయ్యాడు. దండకారుణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడిగా కూడా అతను పని చేసాడు. అలాగే 24 మెరుపు దాడుల్లో కీలక పాత్ర పోషించినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఐఈడీ, యాంబుష్, మెరుపు దాడుల్లో కీలక పాత్ర పోషించాడు.

Also Read : రాహుల్ ముందు రేవంత్ ఆధారాలు.. కీలక నేతకు వీడ్కోలు ఖాయమా..?

2021లో డీఆర్జీ, సిఆర్పీఎఫ్ బలగాలపై హిడ్మా టీం యాంబుష్ అటాక్ చేయగా.. 23 మంది పోలీసులు మృతి చెందారు. 2017 లో సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి చేసి 25 మందిని హతమార్చాడు. గత కొన్నాళ్ళుగా లొంగిపోతాడు అనే ప్రచారం కూడా ఉన్నా సరే.. హిడ్మా మాత్రం లోంగిపోలేదు. ఇటీవల చత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ సాయి.. అతని తల్లితో కూడా ముచ్చటించారు. దర్బా వ్యాలీలో కాంగ్రెస్ కీలక నేత, సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ, పీసీ శుక్లా, పీసీసి చత్తీస్ఘడ్ మాజీ చీఫ్ నందకుమార్ పటేల్ వంటి వారిని కూడా హతమార్చడంలో అతను వ్యూహకర్తగా చెప్తారు. గత కొన్నాళ్ళుగా ఆపరేషన్ కగార్ తీవ్రం కావడంతో అతని టీం.. మారేడుమిల్లి వచ్చినట్లు చెప్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్