Wednesday, August 5, 2026 06:43 AM
Wednesday, August 5, 2026 06:43 AM

భారీ బడ్జెట్ సినిమాలపై దీపిక సెన్సేషనల్ కామెంట్స్..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే.. గత కొన్నాళ్ళుగా సౌత్ ఇండియా మీడియాలో ఎక్కువగా నానుతోంది. ముఖ్యంగా మన తెలుగు మీడియాలో ఆమె పేరు ఎక్కువగా వినపడుతోంది. కల్కీ సహా ఒకటి రెండు సినిమాల నుంచి ఆమెను పక్కన పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వినిపించాయి. సందీప్ రెడ్డి వంగా.. ఆమెను స్పిరిట్ సినిమా నుంచి పక్కన పెట్టడంపై బాలీవుడ్ మీడియా విరుచుకు పడింది. ఆమె అభిమానులు సోషల్ మీడియాలో.. సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసారు.

Also Read : బ్రేకింగ్: మాజీ ప్రధానికి ఉరి శిక్ష..!

ఇక ఆ తర్వాత ఆమెను భరించలేక వైజయంతీ మూవీస్ కూడా పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. ఈ రెండు కూడా భారీ బడ్జెట్ సినిమాలే అయినా ఆమె డిమాండ్ చేసినంత ఇవ్వలేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. తాజాగా ఈ అంశం గురించి దీపిక పరోక్షంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనకు భారీ బడ్జెట్ సినిమాలు అంత గొప్పగా ఏం అనిపించవు అని.. బడ్జెట్ 100 కోట్లా లేదంటే 600 కోట్లా అనేది తనకు మేటర్ కాదని, రెమ్యునరేషన్ గురించి కూడా తాను ఎప్పుడూ పట్టుపట్టలేదు అని చెప్పుకొచ్చింది.

Also Read : నువ్వు స్టేట్ కాదు.. నేషనల్.. ఢిల్లీ వచ్చేయ్..!

తన ఆలోచనా విధానం గురించి మాట్లాడుతూ.. తనకు కొన్ని విషయాలు కమర్షియల్ కోణంలో ఉండవని.. ప్రజల నుంచి వచ్చే ఆదరణ గొప్పది అని, సినిమా కలెక్షన్ లు తాను పెద్దగా పట్టించుకోను అని, ప్రజలు ఇచ్చే మెసేజ్ గొప్పది అంటూ వ్యాఖ్యానించింది. కొందరు సినిమా కలెక్షన్స్ చూసి గుడ్డిగా ప్రజల్లో ఆదరణ ఉంటుంది అనుకుంటారని ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో దీపిక మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్