Saturday, September 19, 2026 03:30 PM
Saturday, September 19, 2026 03:30 PM

ఎట్టకేలకు మూడో స్థానంలో.. ప్రూవ్ చేసుకుంటాడా..?

వాషింగ్టన్ సుందర్.. గత రెండేళ్ళ నుంచి అంతర్జాతీయ క్రికెట్ లో సైలెంట్ గా వినపడుతోన్న పేరు. ఓవర్సీస్ పిచ్ లతో పాటుగా స్వదేశీ పిచ్ లపై అతని ఆట తీరు ఎంతగానో ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్లపై కూడా నిఖార్సైన ఆట తీరుతో దూసుకుపోయాడు ఈ చెన్నై కుర్రాడు. గత ఏడాది జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో తన బ్యాటింగ్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది.. ఇంగ్లాండ్ పర్యటనలో కూడా మెరుగైన ప్రదర్శన చేసి.. కెరీర్ లో తొలి సెంచరీ నమోదు చేసాడు.

Also Read : మరో స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్..?

బౌలింగ్ కంటే కూడా బ్యాటింగ్ లో అతను నిలకడగా ఆడటంపై దిగ్గజ ఆటగాళ్ళు కూడా ప్రసంశలు కురిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇక బ్యాటింగ్ ఆర్డర్ లో అతను టెస్ట్ క్రికెట్ లో మూడవ స్థానంలో ఆడాలి అనే డిమాండ్ లు వినిపించాయి. లెఫ్ట్ హ్యాండర్ కావడంతో మంచి ఉపయోగం ఉంటుందని ఎందరో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు. ఇంగ్లాండ్ పర్యటనలో టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసిన సమయంలో కూడా అతను సెంచరీ చేసాడు. ఎంతో ఒత్తిడిలో నాలుగవ టెస్ట్ లో ఆకట్టుకున్నాడు సుందర్.

Also Read : ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తో క్యాన్సర్ ముప్పు..?

ఇక ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరుగుతోన్న టెస్ట్ సీరీస్ లో.. తొలి టెస్ట్ లో అతనికి మూడవ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. సాయి సుదర్శన్, పడిక్కల్ ను పక్కన పెట్టి.. సుందర్ ను ప్రమోట్ చేసారు. ఇక అతని బ్యాటింగ్ స్థానంలో ద్రువ్ జూరెల్ కు అవకాశం కల్పించారు. పుజారా తర్వాత మూడవ స్థానంలో ఆ స్థాయిలో ఆకట్టుకునే ఆటగాడు కనపడలేదు. ఇప్పుడు సుందర్ గనుక అక్కడ నిరూపించుకుంటే మాత్రం.. బ్యాటింగ్ ఆర్డర్ లో మరింత బలం చేకూరినట్టే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్