Wednesday, February 4, 2026 12:23 PM
Wednesday, February 4, 2026 12:23 PM

ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తో క్యాన్సర్ ముప్పు..?

ఈరోజుల్లో అనారోగ్య సమస్యలు చాలా సహజంగా మారిపోయాయి. ముఖ్యంగా కరోనా తర్వాత వచ్చే వ్యాధులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎప్పుడు ఏ సమస్య ఇబ్బంది పెడుతుందో అర్థం కాక.. ఏ వ్యాధి కొత్తగా పుట్టుకొస్తుందో తెలియక, ఏ ఆహార పదార్థం ఏ రూపంలో ప్రమాదకరంగా మారుతుందో ఊహించలేక చాలామంది భయపడుతూ బ్రతుకుతున్న పరిస్థితి ఉంది. ఇక క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు ఏ విధంగా వస్తాయో తెలియక చాలామందిలో ఒక రకమైన భయం కొనసాగుతోంది. క్యాన్సర్ విషయంలో ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే అది దాడి చేస్తూనే ఉంటుంది.

Also Read : ఆపరేషన్ అరణ్య.. రంగంలోకి పవన్..!

వైద్య ఖర్చులు అత్యంత ఖరీదైనవి కాబట్టి చాలామంది క్యాన్సర్ వైద్యానికి భయపడే పరిస్థితి నెలకొంది. రోడ్లపై తినే ఆహార పదార్థాలతో పాటుగా, ప్రమాదకర వస్తువుల వినియోగం, కాలుష్యం వంటి సమస్యలతో క్యాన్సర్ క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా క్యాన్సర్ కారకాలకు సంబంధించి వైద్యులు కొన్ని హెచ్చరికలు చేశారు. నిత్యం మన ఉపయోగించే రెండు రకాల వస్తువులు, ఆహార పదార్థాలు సైతం క్యాన్సర్ వ్యాధికి కారకంగా మారే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటితో జాగ్రత్తగా లేకపోతే ప్రాణానికి ముప్పు అని వార్నింగ్ ఇస్తున్నారు.

Also Read : నవంబర్ రేసులో మెగాస్టార్, యువసామ్రాట్..!

పదేపదే మరిగించే నూనె అత్యంత ప్రమాదకరమని, కాబట్టి ఆ నూనెతో తయారుచేసిన వంటకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎండకు ఉండే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా అత్యంత ప్రమాదకరంగా సూచిస్తున్నారు. అలాగే చైనీస్ ఫుడ్ లో వాడే సాస్ లు కూడా క్యాన్సర్ కారకాలుగా గుర్తించారు. క్యాండీలు, కృత్రిమ స్నాక్స్, టీ బ్యాగులు, ప్లాస్టిక్ కోటింగ్ ఉండే టీ కప్పులు, ప్రాసెస్ చేసిన ఫుడ్, వాడిన నూనెను పదేపదే వాడటం కూడా మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. కాబట్టి క్యాన్సర్ విషయంలో ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిదని, తక్కువ అంచనా వేయొద్దని వైద్యులు కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్