Wednesday, August 5, 2026 06:58 AM
Wednesday, August 5, 2026 06:58 AM

బ్రేకింగ్: విషమంగా అలనాటి స్టార్ హీరో ఆరోగ్యం

అలనాటి బాలీవుడ్ స్టార్ హీరో.. సూపర్ స్టార్ ధర్మేంద్ర ఆరోగ్యంపై ఆందోళన మొదలైంది. గత కొన్నాళ్ళుగా మీడియాకు దూరంగా ఉంటున్న ధర్మేంద్ర.. తాజాగా ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. షోలే సినిమా ద్వారా యెనలేని పాపులారిటీ సంపాదించిన ఈ అగ్ర హీరో ఆరోగ్యం ఇప్పుడు విషమంగా మారినట్టు వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియా కథనం ప్రకారం.. 89 ఏళ్ళ స్టార్ హీరో ఆరోగ్యం క్రమంగా విషమంగా మారుతోందని, ప్రత్యేక వైద్య బృందం ఆయనను పర్యవేక్షిస్తోందని తెలిపింది.

Also Read : వైసీపీ గేమ్ ప్లాన్ ఫెయిల్ అయినట్లే..!

గతంలో అక్టోబర్ 31న సాధారణ వైద్య పరిక్షల కోసం ఆయన ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అతని అనారోగ్యానికి ఖచ్చితమైన కారణంపై ఇంకా స్పష్టమైన కారణం జాతీయ మీడియా వెల్లడించలేదు. సోమవారం ఆయన్ను మరోసారి ఆస్పత్రికి తరలించగా.. ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు కుటుంబ సభ్యులకు వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి. అప్పటి నుండి అదనపు పరీక్షల కోసం ఆస్పత్రిలోనే అతను ఉంటున్నాడు అని, అతని కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ తమ తండ్రి వద్దనే ఉన్నట్టు జాతీయ మీడియా వెల్లడించింది.

Also Read : పెద్దిరెడ్డి అక్రమాల వీడియోలు తీయించానన్న పవన్.. సూపరన్న చంద్రబాబు..!

ఇక ఈ వార్తలపై సన్నీ డియోల్ టీం రెస్పాండ్ అయింది. ధర్మేంద్ర ఆరోగ్యంగా ఉన్నారని, వార్తలను తోసి పుచ్చింది. రెండు వారాల క్రితం, ధర్మేంద్ర సాధారణ వైద్య పరిక్షల కోసం వచ్చారని, ఇప్పుడు కూడా అలాగే వచ్చారని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం మెరుగు పడుతోందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాతీయ మీడియా అంటోంది. వయసు మీద పడటంతోనే కొన్ని సమస్యలు వస్తున్నాయని, అందుకే ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ఆయన కోలుకుంటున్నారని సన్నీ డియోల్ టీం వెల్లడించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్