Wednesday, October 14, 2026 07:07 PM
Wednesday, October 14, 2026 07:07 PM

లోకేష్ దెబ్బకు అలెర్ట్ అయిన టీడీపీ నేతలు.. నియోజకవర్గాల్లో పరుగులు

పదవిలోకి వచ్చిన తర్వాత చాలామంది నాయకులు కార్యకర్తలను పట్టించుకోరు అనే విమర్శలు మనం ఎప్పటినుంచో వింటూనే ఉంటాం. గ్రీవెన్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించే విషయంలో కొంతమంది అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలున్నాయి. కొంతమంది నేతలు అధిష్టానాలు చెప్తున్న సరే సొంత వ్యవహారాల పై పెట్టిన దృష్టి కార్యకర్తలు, ప్రజల సమస్యలపై పెట్టరు అనేది ఎప్పటినుంచో ఉన్న విమర్శ. ఈ అంశాన్ని టిడిపి అగ్రనేత, మంత్రి నారా లోకేష్ సీరియస్ గా పరిగణించారు.

Also Read : బోల్డ్ డెసిషన్ తీసుకున్నా.. రాజ్ నిడమోరుతో సమంత

ఇటీవల పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళిన లోకేష్.. అక్కడ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వారి సంఖ్య చూసి షాక్ అయ్యారు. దాదాపు 5 వేల మంది పార్టీ కేంద్ర కార్యాలయానికి రావడంతో లోకేష్ కంగుతిన్నారు. తనకు చెప్పుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని వచ్చిన కార్యకర్తలను చూసి లోకేష్ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పార్టీ నేతలపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు గ్రీవెన్స్ నిర్వహిస్తే ఇంతమంది ప్రజలు తనను కలిసేందుకు పార్టీ కేంద్ర కార్యాలయానికి ఎందుకు వస్తారని లోకేష్ నిలదీశారు. నియోజకవర్గాల్లో నాయకులు ఖచ్చితంగా ప్రజాదర్బార్ నిర్వహించాల్సిందేనని ఆదేశించారు.

Also Read : సీబీఐ.. అప్పుడు వద్దు.. ఇప్పుడు కావాలి..!

ఇక సిచువేషన్ అర్థం చేసుకున్న నాయకులు వెంటనే పరుగులు తీయడం మొదలుపెట్టారు. లోకేష్ ఆదేశాలు ఇచ్చిన వెంటనే.. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ప్రజా దర్బార్ నిర్వహించడం మొదలుపెట్టారు. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పెద్ద ఎత్తున ప్రజాదర్బార్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు ప్రజలతో దురుసుగా మాట్లాడిన నాయకుల ప్రవర్తనలో కూడా కొంత మార్పు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సమస్యలతో వచ్చిన వారితో నాయకులు ఆప్యాయంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ నిర్వహించాల్సిందేనని లోకేష్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. నాయకులు ఎక్కడున్నా సరే శుక్రవారం నియోజకవర్గంలో ఉండి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించాలని ఆదేశించారు లోకేష్.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వైసీపీలో జగన్ ముందు...

“పార్టీ కోసం నిలబడేది ఎవరు..? పదవుల...

హైదరాబాద్ టీ20 ముంగిట...

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న...

ఏపీ బ్రాండ్ ఇమేజ్...

నవ్యాంధ్ర రాజధాని అమరావతి, చారిత్రక నగరమైన...

జగన్ కు మ్యూజిక్...

వైఎస్సార్‌సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్...

రాహుల్ దెబ్బ.. కేంద్రంలో...

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు...

ఫ్యాక్షన్ గడ్డపై సతీమణుల...

రాయలసీమ రాజకీయాల్లో ఎప్పుడూ అత్యంత వేడి...

పోల్స్