Thursday, May 7, 2026 04:42 AM
Thursday, May 7, 2026 04:42 AM

బాలీవుడ్ లో దేవరకు గేటు క్లోజ్..?

ఈ రోజుల్లో పాన్ ఇండియా లెవెల్ లో ఒక్క సినిమా హిట్ అవ్వగానే.. పాన్ ఇండియా స్టార్ అనేస్తున్నారు. ఫ్యాన్స్ ఎలివేషన్లు కూడా అదే రేంజ్ లో ఉంటున్నాయి. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు సౌత్ ఇండియాలో ఇదే ట్రెండ్ నడుస్తోంది. భారీ బడ్జెట్, పాన్ ఇండియా.. ఈ రెండు ట్యాగ్ లతో సినిమాకు హైప్ పెంచేస్తున్నారు. ఇలా పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్.. లక్కీగా వార్ 2 అనే భారీ బడ్జెట్ సినిమాలో ఛాన్స్ కొట్టేసాడు. కెరీర్ లో మొదటిసారి నెగటివ్ రోల్ లో కనిపించాడు.

Also Read : సెట్స్ లో వంట చేస్తున్న శోభిత ధూళిపాళ

ఆ రోల్ ఎన్టీఆర్ కు బాగా ప్లస్ అవుతుందని, బాలీవుడ్ లో డామినేషన్ స్టార్ట్ అవుతుందని ఫ్యాన్స్ చాలా ఊహించారు. ఇక నిర్మాత కూడా ఎన్టీఆర్ కు భారీ రెమ్యునరేషన్ ఇవ్వడంతో.. ఎన్టీఆర్ రేంజ్ పెరిగిందని ఊహించారు ఫ్యాన్స్. కానీ ఆ సినిమా బోల్తా పడింది. కనీసం పెట్టుబడి కూడా రాలేదు. ఇటు తెలుగులో కూడా భారీగా ఖర్చు పెట్టి కొన్నా సరే.. ఎన్టీఆర్ ఇమేజ్ వర్కౌట్ కాలేదు. వాస్తవానికి ఎన్టీఆర్ ఇమేజ్ తో భారీగా లాభాలు వస్తాయని, తెలుగు, కన్నడలో ఎన్టీఆర్ బ్రాండ్ కాపాడుతుందని యష్ రాజ్ ఫిలిమ్స్ అంచనా వేసింది.

Also Read : హరీష్ ఇంట్లోనే కేటిఆర్.. జాగ్రత్త పడుతున్న చిన్న సారు..!

కానీ సినిమాలో పస లేకపోవడం, దానికి తోడు ఎన్టీఆర్ రోల్ కూడా కామెడిగా ఉందనే టాక్ రావడంతో లాభాలు కాదు.. పెట్టుబడి కూడా రాలేదు. దీనితో ఎన్టీఆర్ కు ఇక బాలీవుడ్ దారులు మూసుకుపోయినట్టే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. దేవర సినిమా సౌత్ లోని కర్ణాటక, తమిళనాడులో బాగా ఆడింది. హిందీలో కరణ్ జోహార్ కు నష్టాలు మిగిల్చింది. దీనితో ఎన్టీఆర్ బొమ్మకు బాలీవుడ్ లో అంత వెయిట్ లేదనే క్లారిటీ వచ్చేసింది అంటున్నాయి సినీ వర్గాలు. మరి ఫ్యూచర్ లో ఎన్టీఆర్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్