Sunday, October 18, 2026 03:05 AM
Sunday, October 18, 2026 03:05 AM

రష్యా – ఉక్రెయిన్ వార్.. ట్రంప్ సంచలన నిర్ణయం

ఉక్రెయిన్ – రష్యా యుద్దం ఇప్పట్లో ముగిసే సంకేతాలు కనపడటం లేదు. రోజు రోజుకు యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. ఉక్రెయిన్ చేతిలో చావు దెబ్బలు తింటున్న రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ కు చుక్కలు చూపించడానికి రెడీ అయింది. తమ సైనికాధికారులను కోల్పోయిన రష్యా.. ఉక్రెయిన్ పై వైమానిక దాడులకు రంగం సిద్దం చేసింది. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ కు ఆయుధ సహకారం అందించేందుకు అమెరికా ముందుకు వచ్చింది.

Also Read : నిద్రించే సమయంలో ఎటువైపు తిరిగి పడుకోవాలి?

రష్యా దూకుడు పెరుగుతున్న నేపథ్యంలో, ఉక్రెయిన్‌కు పేట్రియాట్ వైమానిక రక్షణ వ్యవస్థలను పంపనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. మేము వారికి పేట్రియాట్స్‌ ను పంపుతామని.. వారికి ఇది చాలా అవసరమన్నారు ట్రంప్. జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. ఎన్ని పంపాలి అనే దానిపై తాను ఏ నిర్ణయం తీసుకోలేదని, కాని ఇది ఉక్రెయిన్ కు చాలా అవసరం అన్నారు ట్రంప్. త్వరలోనే ఉక్రెయిన్ కు వాటిని అందిస్తామని తెలిపారు.

Also Read :ఇండియన్స్ కు ఎక్స్ గుడ్ న్యూస్

కాల్పుల విరమణ లక్ష్యంగా గతంలో చర్చలు జరిగినప్పటికీ రష్యా క్షిపణి దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌కు ఆయుధాలు సమకూర్చాలని అమెరికా నిర్ణయం తీసుకుంది. రష్యా అధ్యక్షుడు పగలు చాలా అందంగా మాట్లాడతారని, రాత్రి సమయంలో బాంబులు వేస్తారు అంటూ సంచలన కామెంట్స్ చేసారు. ఇక రష్యాపై ఆంక్షలు విధించే విషయంలో తాను త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటా అంటూ కూడా ట్రంప్ ప్రకటించారు. రష్యాపై 500 శాతం సుంకాలు విధిస్తే అది భారత్ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండవచ్చు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తిరువూరు కూటమిలో అసమ్మతి.....

కూటమిలో కుంపటి రాజేశారు. తొలి నుంచి...

Garividi Lakshmi Review:...

ఉత్తరాంధ్ర జానపద కళాసంప్రదాయంలో తనకంటూ ప్రత్యేక...

రాయచోటిలో ఆయుధాలతో పంజాబ్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

హోం మంత్రి పదవి...

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి...

ఓటమి భయంతోనే దాడులు

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని...

సాక్ష్యాలతో కడిగిపారేసిన ఈడీ.....

మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయి...

పోల్స్