ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొదలైన మొదటి రోజే తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో, రాయచోటిలో ఎన్నికల వేళ అల్లర్లు సృష్టించేందుకు ఒక అంతరాష్ట్ర ముఠా రంగంలోకి దిగిందంటూ వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన ఆయుధాల ఫోటోలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి.
Also Read : తిరుపతిలో హైటెన్షన్.. రెచ్చిపోయిన భూమన అభినయ్‌రెడ్డి..?
వైరల్ అవుతున్న కథనం ప్రకారం, రాయచోటి స్థానిక ఎన్నికలలో గెలుపు సాధించడమే లక్ష్యంగా ఓ రాజకీయ పార్టీ పక్కా ప్రణాళికతో పంజాబ్ రాష్ట్రం నుండి ఒక ప్రత్యేక క్రిమినల్ గ్యాంగ్‌ను ఇక్కడికి రప్పించారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మారణాయుధాలు, పిస్తోళ్లతో సంచరిస్తున్న పది మంది అంతరాష్ట్ర గుండాలను పోలీసులు చాకచక్యంగా గుర్తించి ఆయుధాలతో సహా అరెస్ట్ చేశారని తెలుస్తోంది. స్థానికంగా భయాందోళనలు సృష్టించి, ఎన్నికలను ప్రభావితం చేయడానికే ఈ ప్రమాదకరమైన ముఠాను రంగంలోకి దించారని వార్తలు వస్తున్నాయి.
Also Read : బియ్యానికీ కృత్రిమ కొరత.. పాలకులు స్పందించరా?
ఈ ఆయుధాల ముఠా అరెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే వైసీపీ అధినేత జగన్ మరోసారి రాష్ట్రంలో హింసాకాండకు, అరాచకాలకు తెరలేపారని వారు ఆరోపిస్తున్నారు. రాయచోటిలో తమ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం పంజాబ్ గ్యాంగ్‌ను దిగుమతి చేసుకోవడం వారి నేరపూరిత మనస్తత్వానికి నిదర్శనమని, రాష్ట్రంలో ఇంకెన్ని ప్రాంతాలకు ఇలాంటి క్రిమినల్ ముఠాలను రప్పించారో అంటూ కూటమి కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


