Sunday, June 21, 2026 05:05 AM
Sunday, June 21, 2026 05:05 AM

హెచ్ 1 బీ పై ట్రంప్ సర్కార్ ఫోకస్..?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే ఒక్కో నిర్ణయం సంచలనంగా మారుతోంది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన విదేశాలకు షాక్ ల మీదగా షాక్ లు ఇస్తూ వస్తున్నారు. అమెరికాలోకి వలసదారులను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ ట్రావెల్ ఏజెంట్లపై వీసా ఆంక్షలు విధించిన కొన్ని గంటల తర్వాత ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. రైట్ – వింగ్ ఫైర్‌బ్రాండ్ గా పేరొందిన.. లారా లూమర్ హెచ్ 1 బీ వీసాల విషయంలో ఆసక్తికర కామెంట్స్ చేసారు.

Also Read : బాబోయ్ జగన్.. ఇదేం లాజిక్కు..!

ప్రతి సంవత్సరం వేలాది మంది భారత కార్మికులను అమెరికన్ కంపెనీలకు తీసుకువచ్చే తాత్కాలిక వీసా వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేసారు. ఒకవేళ ఈ విషయంలో ట్రంప్ జోక్యం చేసుకుంటే మాత్రం.. టెక్ నిపుణులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ వీసా హోల్డర్లలో భారతీయులే ఎక్కువ మంది ఉన్నారు. 2022లో, ఆమోదించిన 3,20,000 వీసాలలో 77% భారతీయులకే వచ్చాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో, జారీ చేసిన 3,86,000 వీసాలలో భారతీయులకు 72.3% వీసాలు వచ్చాయి.

Also Read : ఐఎస్ఐ ఎలా పని చేస్తుంది..? పాక్ గూడచారి సంస్థ సంచలన విషయాలు

హెచ్ 1 బీ కార్యక్రమం వార్షికంగా 65,000 కొత్త వీసాలను జారీ చేస్తూ వస్తున్నారు. అమెరికాలో విద్యా సంస్థ నుంచి మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదువులు చదిన వారికి అదనంగా 20,000 వీసాలు అందుబాటులో ఉంటాయి. భారత ట్రావెల్ ఏజెంట్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ లు కూడా ట్రంప్ సర్కార్ లో కీలక వ్యక్తులు చేస్తూ వస్తున్నారు. ఫిబ్రవరిలో, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన ప్రకటన ప్రకారం.. 2009 నుండి 15,157 మంది అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరించిందని పార్లమెంట్ కు తెలిపారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్