Sunday, March 22, 2026 01:17 PM
Sunday, March 22, 2026 01:17 PM

ప్రభుత్వం కూలుతుందా..? సైలెంట్‌గా కాంగ్రెస్..?

తెలంగాణ రాజకీయాల్లో ప్రభుత్వం కూలిపోతుంది అనే ఓ ప్రచారం ఆసక్తిని రేపుతోంది.. పలు పత్రికల్లో వస్తున్న కథనాలు సోషల్ మీడియాలో జరుగుతున్న హడావుడి అన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాయి. 2023లో తొలిసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. పదేళ్లపాటు భారత రాష్ట్ర సమితి.. తెలంగాణలో అధికారంలో ఉండగా, 2023లో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది.

Also Read : ముఖ్య‌మంత్రి పీ4 ఆద‌ర్శంగా.. గొట్టిపాటి అడుగులు..!

ఆ తర్వాత రేవంత్ రెడ్డి రాజకీయంగా దూకుడుగా వెళ్లినా పరిపాలన పరంగా మాత్రం వెనకబడ్డారు అనేది ప్రధాన ఆరోపణ. దానికి తోడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఏవైతే ఆరోపణలు చేశారో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా భారత రాష్ట్ర సమితిని టార్గెట్ చేయడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా కాస్త మింగుడు పడలేదు. పదేపదే కేసీఆర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి కాస్త చులకనయ్యారు అనే అభిప్రాయం కూడా బలపడుతోంది.

Also Read : నేతల రాజీనామాల వెనుక కారణమదే..!

అయితే ప్రభుత్వంలో క్రమంగా రేవంత్ రెడ్డి పై వ్యతిరేకత పెరుగుతూ వస్తోందంటూ వార్తలు వినపడుతున్నాయి. కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు ముఖ్యమంత్రి పదవిపై కన్నేసారని.. ముఖ్యంగా ఓ సీనియర్ నేత ముఖ్యమంత్రి పదవి కోసం ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. పత్రికల్లో కూడా దీనిపై కథనాలు వచ్చిన ప్రభుత్వ పెద్దల నుంచి మాత్రం ఎటువంటి మీడియా సమావేశాలు లేకపోవడం గమనార్హం. అటు గులాబీ పార్టీ కూడా పరిస్థితులు ఎలా ఉన్నా సరే అవసరం అయితే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read : ఆ మాజీ అరెస్టు ఖాయమైనట్లే..!

కొంతమంది గులాబీ పార్టీ కార్యకర్తలు మరోసారి సీఎం కేసీఆర్ రాబోయే రెండు నెలల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. ఇక దీనిపై కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా పెద్దగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకపోవడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత పెంచుతోంది. మరి దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సన్నిహిత వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయి అనేది చూడాలి. అయితే కొంతమంది కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ కార్యకర్తలు కాడి వదిలేసారని అభిప్రాయం కూడా బలంగా వినపడుతోంది. రేవంత్ రెడ్డి వైఖరి నచ్చని కొంతమంది ఆయనను సమర్థించే విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నట్లు గత నెల రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్