Sunday, March 22, 2026 07:46 PM
Sunday, March 22, 2026 07:46 PM

ఇదీ కింగ్ బ్రాండ్.. హోరెత్తుతున్న సోషల్ మీడియా

టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం ఏమో గానో సోషల్ మీడియా మాత్రం షేక్ అవుతోంది. కోహ్లీ.. తప్పుకుంటున్నాడు అనే వార్త వచ్చిన దగ్గరి నుంచి సోషల్ మీడియాలో అభిమానులతో పాటుగా.. న్యూస్ చానల్స్ కూడా హడావుడి చేయడం మొదలుపెట్టాయి. అతను ఇంగ్లాండ్ పర్యటన వరకు ఉంటాడని చాలా మంది ఆశించారు. కాని టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నా అంటూ కోహ్లీ చేసిన పోస్ట్ దెబ్బకు ఒక్క దెబ్బకు అంతర్జాతీయ మీడియా కూడా కోహ్లీని ఫోకస్ చేసింది.

Also Read : షాక్ ఇచ్చిన కోహ్లీ.. మొన్న రోహిత్ నేడు కోహ్లీ

అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ ఆటగాళ్ళు, సినీ నటులు, సోషల్ మీడియా పేజ్, అంతర్జాతీయ మీడియా అన్ని కోహ్లీ నామస్మరణ చేస్తున్నాయి. సాధారణంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.. ఎవరైనా ఆటగాడు రిటైర్ అయితే సోషల్ మీడియాలో ఒకటి రెండు పోస్ట్ లతో సరిపెడుతుంది. కానీ కోహ్లీ విషయంలో మాత్రం ఇది పూర్తిగా భిన్నంగా జరిగింది. అతను రిటైర్ అయిన క్షణం నుంచి.. అతనికి సంబంధించిన పోస్ట్ లు చేస్తోంది. అతను పాత జ్ఞాపకాలను నేమరవేసుకుంటూ పోస్ట్ లు చేస్తోంది.

Also Read : ఇంటరెస్టింగ్ గా టెస్ట్ టీం సెలెక్షన్.. కొత్త ఆటగాళ్ళు ఎవరు..?

కోహ్లీ సాధించిన ఘనతలు, అతను సెంచరీలు చేసిన సందర్భాలో చేసుకున్న వేడుకల ఫోటోలు ఇలా ప్రతీ ఒక్కటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తోంది. ఇక ప్రముఖ వ్రేజ్లర్ లు, క్రికేటేతర ఆటగాళ్ళు.. కోహ్లీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆర్మీ అధికారులు సైతం మీడియా సమావేశంలో కోహ్లీ గురించి ప్రస్తావించడం గమనార్హం. ఇక తాను రిటైర్ అవుతున్నా అంటూ కోహ్లీ చేసిన పోస్ట్ కు 16 మిలియన్ల లైక్స్ రాగా.. అతని భార్య అనుష్క శర్మ చేసిన పోస్ట్ కు 10 మిలియన్ల మంది లైక్ కొట్టారు. ఇలా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం కోహ్లీ దెబ్బకు షేక్ అయిపోతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్