Friday, September 12, 2025 09:25 PM
Friday, September 12, 2025 09:25 PM
roots

మరో ఐఏఎస్ అరెస్టు ఖాయం..!

వైఎస్ కుటుంబాన్ని నమ్ముకుంటే అంతే సంగతులు.. పోతే జైలుకు… లేదంటే పైకి.. అంతే తప్ప మరో మార్గం మాత్రం లేదు. నమ్ముకున్న వారిని నట్టేట ముంచడం ఆ కుటుంబానికి మాత్రమే చెల్లింది. ఇంకా చెప్పాలంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఐదున్నరేళ్ల కాలంలోనే అన్ని అవినీతి ఆరోపణలు, హత్యా రాజకీయాలు, అక్రమాలు చోటు చేసుకున్నాయి. వీటన్నిటికి కారణం ఏమిటీ అని ఓ సారి పరిశీలిస్తే.. అన్ని వేళ్లు వైఎస్ఆర్ కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపే చూపిస్తాయి. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల ప్రజాధనాన్ని నిలువునా దోచేసిన చరిత్ర జగన్ మోహన్ రెడ్డిది. అక్రమాస్తుల కేసులో ఈడీ ఏకంగా 43 వేల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిందంటే… అవినీతి ఏ రేంజ్‌లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది అధికారుల అండతో జగన్ చేయని అరాచకం లేదు. జగన్ తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారు. మీడియా సంస్థతో మొదలైన జగన్ దోపిడీ.. మైనింగ్, లిక్కర్, శాండ్, పవర్, రియల్ ఎస్టేట్.. ఇలా ఒకటేమిటి.. అది ఇది అనే తేడా లేకుండా.. అవకాశం ఉన్న ప్రతిచోట వేల కోట్లు దోచేశారు.

Also Read : కూటమి సర్కారుపై జగన్‌ ముఠా మరో కొత్త వ్యూహం..!

అనంతపురం, బళ్లారి సరిహద్దుల్లోని ఓబులాపురం మైనింగ్‌లో జగన్ అండ్ కో దోపిడీ చేసింది. ఈ కేసును సుమారు 15 ఏళ్ల పాటు విచారించిన నాంపల్లి సీబీఐ కోర్టు.. ఐదుగురిని నిందితులుగా గుర్తించింది. ఆ ఐదుగురికి శిక్షలు కూడా ఖరారు చేసింది. అయితే ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓబులాపురం మైనింగ్ కార్పోరేషన్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారని ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై ఆరోపణలు. ఆ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి అరెస్టు కూడా అయ్యారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కేసులో ఆరో నిందితురాలిగా ఉన్న ఆమె 2011లో అరెస్ట్ అయ్యింది. ఆమె 2011లో అక్రమ మైనింగు కేసులో అరెస్టవడంతో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆమెను సస్పెండ్‌ చేసింది. శ్రీలక్ష్మి ఏప్రిల్ 2, 2013న చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమె షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యారు. ఆమె జైలు నుంచి బెయిల్‌పై విడుదలయిన తర్వాత సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తి వేసింది.

Also Read : టీడీపీ సోషల్ మీడియాకు గుర్రంపాటి బెదిరింపులు

ఆ తర్వాత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన శ్రీలక్ష్మి.. తనపై అక్రమంగా కేసు పెట్టారని.. తనకు ఏ పాపం తెలియదని పిటిషన్ వేశారు. దీంతో శ్రీలక్ష్మి వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు ఓఎంసీ కేసులో ఆమెకు విముక్తి కలిగిస్తూ తీర్పు ఇచ్చింది. దీనిపై సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘ వాదనల తర్వాత ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టేసింది. దీంతో శ్రీలక్ష్మి కూడా ఓఎంసీ కేసులో నిందితురాలిగా పరిగణించినట్లే అవుతుంది. ఇప్పటికే ఓఎంసీ కేసులో ఐదుగురికి శిక్ష పడగా.. ఇద్దరిని మాత్రమే కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. తాజాగా సుప్రీం తీర్పుతో శ్రీలక్ష్మి విషయంలో సీబీఐ కోర్టు తీర్పు ఎలా వస్తుందో అనే అంశం ఉత్కంఠగా మారింది.

Also Read : ఆపరేషన్ సిందూర్ కు జై కొట్టిన అగ్ర దేశాలు

వైఎస్ కుటుంబానికి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి అత్యంత నమ్మకంగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలక శాఖలకు కమిషనర్‌గా శ్రీలక్ష్మి పని చేశారు. వైఎస్ ప్రభుత్వంలో జగన్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టారు. విచ్చలవిడిగా మైనింగ్ కేటాయింపులు చేశారు. చివరికి జైలుకు వెళ్లారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకే పరిమితమైన శ్రీలక్ష్మి.. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీలక్ష్మిని ఏపీకి తీసుకువచ్చారు. ఆ తర్వాత కీలకమైన పురపాలక కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఐదేళ్ల పాటు జగన్ చెప్పినట్లుగానే శ్రీలక్ష్మి నడుచుకున్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శ్రీలక్ష్మిపై బదిలీ వేటు వేసింది. జూన్ 19న జీఏడీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నాటి నుంచి ఎలాంటి పోస్టింగ్ లేకుండానే ఉన్నారు. తాజాగా సుప్రీం తీర్పుతో ఏపీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్