Saturday, September 19, 2026 03:51 PM
Saturday, September 19, 2026 03:51 PM

పూరి ఇప్పుడైనా గాడిలో పడతాడా..?

టాలీవుడ్ స్టార్ హీరోల కెరీర్ మార్చిన.. పూరి జగన్నాథ్ ఇప్పుడు ఒక్క సినిమా హిట్ అయిన చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో పూరి చేసిన సినిమాల్లో ఒకటి కూడా ఆశించిన రేంజ్ లో ఆకట్టుకోలేదు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూనే ఉంది. ప్రస్తుతం గ్యాప్ తీసుకుంటున్న పూరి త్వరలోనే కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. పూరి జగన్నాథ్ కు తమిళంలో కూడా కాస్త మార్కెట్ ఉంది. దీనితో అక్కడి హీరోతో సినిమా చేసేందుకు స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు.

Also Read : అల్లు అర్జున్ పై క్రిమినల్ కేసు పెట్టాల్సిందే

తమిళ సార్ హీరో విజయ్ సేతుపతితో సినిమా ఫైనల్ చేశాడు. కథ బాగుండడంతో విజయసేతుపతి కూడా తెలుగు మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని వెంటనే ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో విలన్ గా తెలుగు హీరోనే తీసుకునే ఆలోచన చేస్తున్నాడు పూరి. టాలీవుడ్ లో.. గోపీచంద్ కు హీరో కంటే విలన్ గానే ఫాలోయింగ్ ఎక్కువ. గోపీచంద్ మళ్లీ విలన్ గా చేయాలని ఫాన్స్ ఎప్పటినుంచో అడుగుతూనే ఉన్నారు. దీని గురించి మీడియాలో కూడా ఎన్నో రూమర్స్ వస్తూనే ఉంటాయి.

Also Read : రజనీకి స్టార్ట్ అయింది.. మరిది తర్వాత ఎవరు..?

ప్రస్తుతం గోపీచంద్ కూడా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ టైంలో పూరి జగన్నాథ్ నుంచి ఖచ్చితంగా గోపీచంద్ కు మంచి ఆఫర్ వచ్చినట్లే. ఈ సినిమా హిట్ అయితే మనోడు కెరీర్ మళ్ళీ గాడిలో పడే అవకాశాలుంటాయి. చాలామంది స్టార్ హీరోలు విలన్లుగా సక్సెస్ అయ్యారు. మన తెలుగులో లెజెండ్ సినిమాతో జగపతిబాబు విలన్ గా తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు గోపీచంద్ కూడా అలా ప్రూవ్ చేసుకుని టాలీవుడ్ లో దుమ్ము రేపితే అతని కెరీర్ కు తిరుగు ఉండదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్