Wednesday, August 5, 2026 04:26 AM
Wednesday, August 5, 2026 04:26 AM

అల్లు అర్జున్ పై క్రిమినల్ కేసు పెట్టాల్సిందే

కార్పొరేట్ విద్యాసంస్థల ఆధిపత్యం పెరిగిన తర్వాత దేశంలో ఎక్కడా పరిక్షల ఫలితాలు వెలువడిన సరే మీడియాలో హడావుడి వేరే లెవల్లో ఉంటుంది. తమ కాలేజీ గొప్పదంటే తమ కాలేజీ గొప్పదని యాజమాన్యాలు ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నాయి. కార్పొరేట్ కాలేజీల ప్రకటనలకు విద్యార్థులు కూడా.. ఎట్రాక్ట్ అయ్యే పరిస్థితి. ఇక ఈ మధ్యకాలంలో సినిమా వాళ్ళతో కూడా ఈ ప్రకటనలు మొదలుపెట్టారు. తాజాగా ఐఐటి – జేఈఈ ఫలితాలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా కార్పొరేట్ కాలేజీలు సినిమా స్టార్స్ తో ప్రకటనలు ప్రచారం చేయించాయి.

Also Read : టార్గెట్ రోజా… పెద్దాయన మాస్ ర్యాగింగ్..!

అయితే దీనిపై ఇప్పుడు వామపక్ష పార్టీలు విద్యార్థి విభాగం సీరియస్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ హీరోయిన్ శ్రీలీలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వీరిద్దరూ కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్నారని మండిపడింది. వారు ఏ కాలేజీలను ప్రమోట్ చేస్తున్నారో ఆయా విద్యాసంస్థలు తప్పుడు ప్రకటనలు చేస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బెట్టింగ్ యాప్స్ పై కేసులు పెట్టినట్టు గానే వీరిపై కూడా కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తుంది.

Also Read : పాత స్నేహాలకు పదును పెడుతున్న నానీ

కాలేజీలు వాటి యాజమాన్యం చేసే దారుణాలను పట్టించుకోకుండా.. కేవలం కోట్ల పారితోషకానికి ఆశపడి ఇలాంటి ప్రకటనలు చేయడం తగదని మండిపడింది. సహజంగా స్టార్ కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రమోట్ చేస్తే అక్కడ విద్యా అలాగే వసతులు బాగుంటాయని విద్యార్థులు భావిస్తారని, కానీ కాలేజీలో చేరిన తర్వాత విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఏఐఎస్ఎఫ్ ఆవేదన వ్యక్తం చేసింది. వీరు నటించే యాడ్స్ కారణంగా విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అల్లు అర్జున్ తో పాటుగా హీరోయిన్ పై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్