Wednesday, February 4, 2026 08:27 PM
Wednesday, February 4, 2026 08:27 PM

ముంబై సెన్సేషన్ అశ్వనీ కుమార్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

సోమవారం ముంబై తరుపున ఐపిఎల్ ఎంట్రీ ఇచ్చిన.. అశ్వని కుమార్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయాడు. కలకత్తా లాంటి భయంకరమైన జట్టుపై అతను చేసిన ప్రదర్శన ఓ రకంగా సంచలనం అనే చెప్పాలి. 4 వికెట్లు తీసి.. కలకత్తా పతనాన్ని శాసించాడు ఈ యంగ్ పేసర్. పంజాబ్ లోని మొహాలీ సమీపంలోని ఝంఝేరీకి చెందిన ఈ యువ సీమర్.. తన మూడు ఓవర్ల స్పెల్‌లో 4/24తో అదిరిపోయే ప్రదర్శన చేసాడు. ఐపీఎల్ మెగా వేలంలో తన బేస్ ప్రైస్ 30 లక్షలకు అమ్ముడు అయిన అశ్వనీ కుమార్ బ్యాక్ గ్రౌండ్ ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది.

Also Read : రష్మిక దూకుడుకి బ్రేకులు పడ్డాయా..?

అతని గురించి అతని తండ్రి జాతీయ మీడియాకు ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. వర్షం ఉన్నా, ఎండలు ఉన్నా, అశ్వని మొహాలీలోని పిసిఎకు వెళ్లడానికి, ముల్లన్‌పూర్‌లోని కొత్త స్టేడియంకు వెళ్లడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని చెప్పుకొచ్చారు. కొన్నిసార్లు, అతను పిసిఎ అకాడమీకి సైకిల్ మీద వెళ్ళాడని.. లేదంటే ఎవరైనా లిఫ్ట్ ఇస్తే వారితో వెళ్ళే వాడు అని గుర్తు చేసుకున్నారు. షేరింగ్ ఆటోలలో వెళ్లినట్టు గుర్తు చేసుకున్నారు. తన దగ్గర రోజు రూ. 30 తీసుకునేవాడని తనకు గుర్తుందని చెప్పుకొచ్చాడు.

Also Read : హైదరాబాద్ ను వేటాడుతున్నాడు..!

మెగా వేలంలో ముంబై ఇండియన్స్ అతన్ని రూ. 30 లక్షలకు తీసుకున్నప్పుడు, అతని విలువ తనకు తెలుసు అన్నారు. అకాడమీలోనే రాత్రి పది గంటల వరకు ఉండేవాడు అని మళ్ళీ ఉదయం 5 గంటలకు లేచి వెళ్ళేవాడు అని చెప్పుకొచ్చారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, అతన్ని వేలంలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేస్తుందని భావించినా చివరకు ముంబై దక్కించుకుంది. కలకత్తా బ్యాటింగ్ లైనప్‌ను అద్భుతంగా ఎదుర్కొన్న అశ్వని ముంబై ఇండియన్స్ తరఫున ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్