Sunday, March 22, 2026 02:36 PM
Sunday, March 22, 2026 02:36 PM

నందిగం సురేష్ ను దూరం పెట్టేసిన జగన్..?

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బాపట్ల ఎంపీగా ఉన్న నందిగం సురేష్ కు వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఎక్కడ బహిరంగ సభ నిర్వహించిన ఏదైనా అధికారిక కార్యక్రమాలు నిర్వహించిన సరే నందిగం సురేష్ ను వేదికపై తన పక్కనే కూర్చోబెట్టుకునేవారు వైయస్ జగన్. అయితే తాజాగా నందిగం సురేష్ కు వైసీపీలో ప్రాధాన్యత తగ్గించారు జగన్. 2014 నుంచి 2019 వరకు జగన్ చేసిన కొన్ని కార్యక్రమాల్లో సురేష్ కీలకపాత్ర పోషించారు. అమరావతిలో జరిగిన కొన్ని విధ్వంశాల వెనుక నందిగం సురేష్ ఉన్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి.

Also Read : 7 నెలల తర్వాత తెలంగాణా భవన్ కు.. అసెంబ్లీకి కూడా.. ?

ఇక ఇటీవల సురేష్ జైలుకు వెళ్లి దాదాపు 3 నెలలు తర్వాత బయటకు వచ్చారు. సురేష్ బయటికి వచ్చినప్పటి నుంచి జగన్ ఆయనకు ప్రాధాన్యత తగ్గించారు అని ఆరోపణలు వినపడుతున్నాయి. తాజాగా గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనకు వెళ్ళిన వైయస్ జగన్ నందిగం సురేష్ తో కనీసం మాట కూడా మాట్లాడలేదు. ఇక జగన్ భద్రత సిబ్బంది కూడా సురేష్ ను దూరంగానే ఉంచారు. సురేష్ ను గతంలో ఎన్నోసార్లు జగన్ తన కారులోనే ఎక్కించుకున్న సందర్భాలు ఉన్నాయి. సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు జైలుకు వెళ్లి మరీ పరామర్శించి వచ్చారు జగన్.

Also Read : వంశీ కి ఊహించని షాక్ ఇచ్చిన హైకోర్టు

కానీ ఇప్పుడు మాత్రం సురేష్.. జగన్ వద్దకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నా సరే భద్రతా సిబ్బంది రానీయడం లేదు. కొడాలి నాని అలాగే వైవి సుబ్బారెడ్డి వంటి వాళ్లు మాత్రమే జగన్ వద్ద కనిపించారు. ఇక జగన్ కాన్వాయ్ లో వీళ్ళిద్దరితోపాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా ఉన్నారు. నందిగం సురేష్ కూడా కారు ఎక్కే ప్రయత్నం చేస్తుంటే భద్రత సిబ్బంది అతన్ని పక్కకు నెట్టేశారు. ఒకప్పుడు సురేష్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన జగన్ కనీసం ఇప్పుడు దగ్గరకు కూడా రానీయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్