Saturday, July 4, 2026 08:35 PM
Saturday, July 4, 2026 08:35 PM

7 నెలల తర్వాత తెలంగాణా భవన్ కు.. అసెంబ్లీకి కూడా.. ?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వస్తున్నారు. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న ఆయన ఇప్పుడు రాజకీయంగా దూకుడు పెంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణలో వాతావరణం భారత రాష్ట్ర సమితికి ఇబ్బందికరంగా ఉండటంతో కేసీఆర్ ఇక ప్రజలలోకి రావాలని నిర్ణయం తీసుకున్నట్టు ఈ మధ్య ప్రచారం మొదలైంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. పార్టీలోని ఎమ్మెల్యేలకు అలాగే మాజీ మంత్రులకు ఇప్పటికే బడ్జెట్ సమావేశాలు విషయంలో కేసీఆర్ నుంచి ఫోన్లు వెళ్లాయని.. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారని ప్రచారం జరిగింది.

Also Read : ఏపీపై కేంద్రం మరోసారి స్పెషల్ లవ్

ఇక ఈ వార్తలకు బలం చేకూరుస్తూ తాజాగా కెసిఆర్ ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేసీఆర్.. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ముచ్చటించారు. పార్టీని స్థాపించి 24 ఏళ్లు పూర్తయి 25వ ఏట అడుగుపెడుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన నేతలకు దిశ నిర్దేశం చేశారు. ఆవిర్భావ వేడుకలు అలాగే సభ్యత్వ నమోదు తో పాటుగా భారీ బహిరంగ సభ.. తదితర అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే సూచనలు కనపడుతున్నాయి.

Also Read : సెలెక్టర్లపై రహానే సంచలన కామెంట్స్

ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసే అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. మరి కేసీఆర్ హాజరవుతారా లేదా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కేసీఆర్ ఇన్నాళ్లు ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. ఇక 7 నెలల తర్వాత ఆయన పార్టీ నేతలను డైరెక్ట్ గా కలవడానికి తెలంగాణ భవన్ కు రావడం రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది..

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు...

ఏపీలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా...

కవిత కొత్త పార్టీకి...

కల్వకుంట్ల కవిత ఇటీవలే ప్రతిపాదించిన నూతన...

రివేంజ్ ట్రాన్స్‌ఫర్స్.. నిజమేనా..?

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న పరిపాలనాపరమైన...

లోకేష్ మార్క్ మ్యాజిక్.....

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో నవశకం మొదలైంది. కూటమి...

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం...

ఉద్యోగుల భవిష్య నిధి నిబంధనలను కేంద్ర...

సాయికృష్ణ మృతి కేసులో...

విజయవాడలో తీవ్ర కలకలం రేపిన రౌడీ...

పోల్స్