Thursday, February 5, 2026 04:31 AM
Thursday, February 5, 2026 04:31 AM

ఏపీలో ప్రభుత్వం మారిందా.. లేక..!

ఏపీలో ప్రభుత్వం మారిందా… లేక వైసీపీ సర్కార్ కొనసాగుతుందా… ఇదే ఇప్పుడు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మదిలో ఉన్న ప్రశ్న. ఏపీలో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 8 నెలలు గడిచింది. అయితే ఇప్పటికీ ఇంకా వైసీపీ హయాంలోని అధికారుల హవానే నడుస్తోంది. అలాగే వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన వారికే ఇప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో సగటు టీడీపీ అభిమానులు మాత్రం… నేతలపై విమర్శలు చేస్తున్నారు. ఏపీలో చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా… లేక జగన్ పార్టీ వైసీపీ అధికారంలో ఉందా అనేది సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనుమానం. ఇందుకు తాజాగా జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తున్నారు.

Also Read : తెలంగాణాపై ఫోకస్.. లోకేష్ ఢిల్లీలో ఇంట్రస్టింగ్ సీన్..!

రధసప్తమి వేడుకలను ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించింది. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో రధసప్తమి ఉత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించారు. అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వహించిన అధికారులు.. చిన్న తప్పుతో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చారు. అంతటితో ఆగకపోగా… అగ్నికి ఆజ్యం పోసినట్లుగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యవహరించిన తీరు ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు తెరలేపింది. అరసవల్లి రధసప్తమి ఉత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 3వ తేదీన శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో భారీ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ప్రముఖ గాయని మంగ్లీని ఆహ్వానించారు. ఇందుకోసం మంగ్లీకి సుమారు రూ.10 లక్షల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రధసప్తమి రోజున మంగ్లీని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెంటబెట్టుకుని మరీ గుడిలోకి తీసుకెళ్లారు. వీవీఐపీ ప్రోటోకాల్ దర్శనం చేయించారు. ఇదే ఇప్పుడు టీడీపీ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పిస్తోంది.

Also Read : వైసీపీకి చావు దెబ్బ.. బాలినేని రివేంజ్ మోడ్..?

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎస్వీబీసీ ప్రత్యేక సలహాదారుగా మంగ్లీని నియమించారు. కనీసం ఒక్కసారి కూడా ఎస్వీబీసీకి రాలేదు.. ఒక్క సలహా కూడా ఇవ్వలేదు. పైగా ప్రతి నెలా రూ.లక్షన్నర వరకు జీతం తీసుకున్నారు మంగ్లీ. ఇక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం పాట పాడాలని కోరిన పార్టీ నేతలకు మంగ్లీ షాకింగ్ జవాబిచ్చారు. తాను జగన్ అభిమానినని… తన నోటి నుంచి చంద్రబాబు అనే మాట రాదని తేల్చి చెప్పేశారు. ఈ విషయం అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అటు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అనుకూలంగా ప్రచారం చేసిన సమయంలో కూడా చంద్రబాబుపై విమర్శలు చేశారు మంగ్లీ. ఇప్పుడు అదే మంగ్లీకి భారీ పారితోషికం ఇవ్వడం… దగ్గరుండి మరీ ప్రోటోకాల్ దర్శనాలు చేయించడం ఏమిటనేది సగటు టీడీపీ అభిమాని ప్రశ్న.

Also Read : రికార్డ్ పేరుతో బిల్డప్పులు.. ఎవరి కోసం..?

వైసీపీ ప్రభుత్వంలో జై జగన్ అని అనలేదనే అక్కసుతోనే చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్తను వైసీపీ మూకలు హత్య చేశాయి. చివరికి చనిపోతున్న సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకునే ఉన్నాడు చంద్రయ్య. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మాత్రం… చంద్రబాబు పేరు కూడా పలికేది లేదని తేల్చి చెప్పిన మంగ్లీకి ప్రోటోకాల్ దర్శనాలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే… ప్రభుత్వం మారలేదేమో.. ఓసారి గిల్లి చూసుకోవడం మంచిది అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

1 COMMENT

Comments are closed.

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్