Saturday, March 7, 2026 08:51 PM
Saturday, March 7, 2026 08:51 PM

వైసీపీని వణికిస్తున్న చంద్రబాబు ఫినామినా..!

లోకేశ్‌ని సీఎంని చేయాలి.. కాదు కాదు.. పవన్‌ కళ్యాణ్‌కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి.. అంటూ ఒక రేంజ్‌లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగని ఈ డిమాండ్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచో.. జనసేన నాయకుల నుంచో రావడం లేదు.. వైసీపీ నేతల్లో కొందరు లోకేశ్‌ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని కంకణం కట్టుకొన్నట్లు మాట్లాడుతూ ఉంటే.. మరికొందరు మాత్రం పవన్‌ కళ్యాణ్‌కి ముఖ్యమంత్రి సీటు ఇవ్వకపోతే ఊరుకొనే ప్రసక్తే లేదంటున్నారు. ఊళ్లో పెళ్లికి ఎవరిదో హడావుడి అన్నట్లు.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ పెత్తనం ఏంటీ అనుకొంటున్నారా..?? అక్కడికే వస్తున్నా.. వైసీపీ నాయకులు చేస్తున్న డిమాండ్ల వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు సుదీర్ఘ వివరణలు ఇస్తున్నారు.

Also Read : చంద్రబాబు ఖాతాలో మరో రికార్డ్.. ఫస్ట్ ఛాన్స్ చంద్రబాబుకే..!

పరిశ్రమలు తీసుకురావడంలో.. ఉద్యోగాలు కల్పించడంలో.. కొత్త నగరాల నిర్మాణంలో.. మొత్తంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి సాటి, పోటీ లేరు. డెవలప్‌మెంట్‌తో పాటు సంక్షేమంలోనూ చంద్రబాబు కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రంలో వైసీపీ గెలిచే అవకాశం లేదని ఆ పార్టీ నేతలే అనుకొంటున్నారు. అందుకే బీహార్‌లో నితీశ్‌కుమార్‌ సీఎం పదవి వదిలేసి రాజ్యసభకు వెళ్తే.. సేమ్‌ సీన్‌ ఏపీలోనూ రిపీట్‌ అవుతుందనే ప్రచారం ప్రారంభించారు. అంతటితో ఊరుకోకుండా.. లోకేశ్‌ సీఎం అవుతారని కొంత మంది.. పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి అని మరికొంత మంది మాట్లాడటం ప్రారంభించారు. ఇలాంటి నినాదాలతో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు సృష్టించడమే వైసీపీ అసలు టార్గెట్‌.

Also Read : కేతిరెడ్డి అరెస్ట్ కు రంగం సిద్దం..?

2019కి ముందు పరిపాలనలో జగన్‌కి ఎలాంటి రికార్డు లేదు. కానీ ఇప్పుడలా కాదు. ఐదేళ్ల ఆయన పాలన కాలంలో ఏం చేశారో.. ఏం చేయలేదో ప్రజలకు బాగా తెలుసు. ఆ రికార్డుని.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు రికార్డుతో పోల్చి చూడటం సహజం. బాబుగారి ట్రాక్‌ రికార్డుతో పోల్చితే.. జగన్‌రెడ్డికి మైనస్ మార్కులే పడతాయి. అందుకే చంద్రబాబు అనే ఫినామినాన్.. వైసీపీని భయపెడుతోంది. ఆయన రాష్ట్ర రాజకీయాలు వదిలేసి.. ఢిల్లీ వెళ్తే బాగుంటుందని కోరుకొంటున్నారు. కోరుకోవడమే కాదు.. ఆల్రెడీ వెళ్లిపోతున్నట్లే ప్రచారం చేస్తున్నారు. కానీ చంద్రబాబుకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ఫస్ట్‌ అండ్‌ మోస్ట్‌ ఇంపార్టెంట్‌ ప్రయారిటీ‌. 1996లో ప్రధానమంత్రి ఆఫర్‌ వచ్చినా.. తిరస్కరించడానికి కారణం అదే. అప్పుట్లో దేశ అత్యున్నత పదవి ఇస్తానంటేనే కాదనుకున్న ఆయన్ను ఇప్పుడు ఏ పదవీ రాష్ట్రం నుంచి దూరం చేయలేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

చంద్రబాబు ఖాతాలో మరో...

పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో ఏపీ సిఎం...

బ్రేకింగ్: బెజవాడ బస్టాండ్...

బెజవాడ బస్టాండ్.. ఆసియాలోనే అతిపెద్ద బస్టాండ్....

ఫైనల్ మ్యాచ్‌కు జగన్.....

ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్...

కేతిరెడ్డి అరెస్ట్ కు...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద...

ఇండియాతో అమెరికా కామెడీ.....

మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న యుద్ద...

సత్యం, నమ్మకం.. వైసీపీ...

భక్తి ముసుగులో ద్రోహం చేస్తుంటే ఆ...

పోల్స్