Saturday, September 19, 2026 02:45 PM
Saturday, September 19, 2026 02:45 PM

వైసీపీ కీలక నేత అరెస్టు..!

వైసీపీలో మరో కీలక నేతను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. వెంకటరెడ్డిపై ఏపీలో ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున వెంకటరెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు.. ముందుగా ఆయనకు నోటీసులిచ్చారు. ఆ తర్వాత వెంకటరెడ్డిని విచారించిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. తాడిపత్రి తాలూకా పోలీసు స్టేషన్‌లో వెంకటరెడ్డిపైన కేసు నమోదైందని.. అందుకే అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలిపారు.

Also Read : భారీ బడ్జెట్ సినిమాలపై దీపిక సెన్సేషనల్ కామెంట్స్..!

వైసీపీ అధికారం ఉన్నప్పుడు కీలక నేతగా వ్యవహరించిన కారుమూరి వెంకటరెడ్డి పార్టీ ఓడిన తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి రోజు టీవీ డిబేట్లలో కూటమి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన వెంకటరెడ్డి.. తన వీడియోకు మీమ్స్ కలిసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే చంద్రబాబు హెరిటేజ్ డెయిరీ సంస్థపైన, నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు చైర్మన్ పైన కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారనే కేసు విచారణ జరుగుతున్న తీరుపై కూడా వెంకటరెడ్డి పోలీసులపైన, దర్యాప్తు బృందంపైన, కూటమి ప్రభుత్వంపైన విమర్శలు చేశారు.

Also Read : భారత్ లో హమాస్ తరహా దాడులకు ప్లాన్..?

తాజాగా పరకామణి చోరీ కేసులో ఫిర్యాదు చేసిన సీఐ సతీష్ కుమార్ హత్యపై కూడా వెంకటరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ పోలీసుల దర్యాప్తుపైన, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీసే విధంగా, సీఎం చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు వెంకటరెడ్డి. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో టీడీపీ నేతలు వెంకటరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన తాడిపత్రి తాలూకా పోలీసులు.. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా కారుమూరి వెంకటరెడ్డి హైదరాబాద్ కూకట్ పల్లిలోని మెరీనా స్కైస్ అపార్ట్‌మెంట్‌ ఉన్నట్లు గుర్తించారు. ఉదయం 6 గంటలకు వెంకటరెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు.. విచారణ అనంతరం అరెస్టు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు.

వెంకటరెడ్డి అరెస్టుపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని.. సోషల్ మీడియాలో, మీడియాలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డిపై కక్షపూరితంగా తప్పుడు కేసు పెట్టించి.. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టడం పరిపాటిగా మారిపోయిందని.. కుటుంబ సభ్యులకి కూడా కేసు వివరాలు చెప్పకుం

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్