Wednesday, May 6, 2026 08:57 PM
Wednesday, May 6, 2026 08:57 PM

ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్.. షర్మిల సంచలనం

ఆస్తులపై తాను చేస్తున్న పోరాటంలో జగన్ పై తాను చేస్తున్న పోరాటంలో… జగన్ బెయిల్ రద్దు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అన్నారు వైఎస్ షర్మిల. ఈడీ అటాచ్ చేసింది షేర్లను కాదు.. 32 కోట్లు విలువ జేసే కంపెనీ స్థిరాస్తి మాత్రమే అని ఆమె స్పష్టం చేసారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసారు. షేర్ల బదలాయింపుపై ఎటువంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవన్నారు. స్టేటస్ కో ఉన్నది షేర్స్ మీద కాదు. గతంలో కూడా ఎన్నో కంపెనీల ఆస్తులను ED అటాచ్ చేసినప్పటికీ వాటి షేర్లు.. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్, బదిలీలను మాత్రం ఆపలేదని స్పష్టం చేసారు.

2016 లో ED, భూములను అటాచ్ చేసినందువల్ల షేర్ల బదిలీ చేయకూడదని వింతగా మీరు చెప్పడం హాస్యాస్పదమన్నారు. 2019 లో షర్మిలా రెడ్డి గారికి 100 శాతం వాటాలు బదలాయిస్తామని స్పష్టంగా పేర్కొంటూ MOU మీద సంతకం చేశారని ఆమె గుర్తు చేసారు. అప్పుడు తెలియదా బెయిల్ రద్దు అవుతుందని అంటూ ఆమె ప్రశ్నించారు. 2021 లో క్లాసిక్ రియాలిటీ, సండూర్ పవర్ కి చెందిన , సరస్వతి షేర్లను 42 కోట్లకు అమ్మ విజయమ్మకు ఎలా అమ్మారు ? అని నిలదీశారు.

Also Read : షర్మిల పై టిడిపికి ఎందుకంత ప్రేమ.. నవ్వుతున్న ప్రజలు..!

అప్పుడు తెలియదా బెయిల్ రద్దు అవుతుందని ? అపుడు స్టేటస్ కో ను ఉల్లంఘించినట్లు కాదా ? అని ఆమె ఘాటు ప్రశ్నలు వేసారు. 2021 లో జగన్ గారు, భారతి రెడ్డి గారు తమ షేర్స్ పై సంతకం చేసి, విజయమ్మ గారికి ఫోలియో నెంబర్లతో సహా రాసి గిఫ్ట్ డీడ్ ఇచ్చారు… ఇచ్చే ముందు తెలియదా బెయిల్ రద్దు అవుతుందని..? అని ప్రశ్నించారు. షేర్స్ ట్రాన్స్ఫర్ కి , బెయిల్ రద్దుకు సంబధం లేదని మీకు కూడా తెలుసు కాబట్టే అప్పుడు అవి చేశారన్నారు. ఇప్పుడు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. NCLT లో కేసు ఉంది కాబట్టి.. షేర్స్ గురించి మాట్లాడితే అది సబ్ జుడీస్ అవుతుందని కొడుకు బెయిల్ కి వచ్చిన ఇబ్బంది ఏమి లేదని విజయమ్మ గారికి తెలుసన్నారు. విజయమ్మ గారు లేఖ తాను రాయకపోతే.. ఆ లేఖతో సంబంధం లేదని, అది నేను రాయలేదని, స్వయంగా లేఖను ఖండించే వారు కదా అని ఆమె ప్రశ్నించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్