2019 లో వైఎస్ జగన్ సిఎం అయ్యారంటే.. కారణం ఏంటీ అనగానే చాలా మంది రాజకీయ పరిశీలకులు చెప్పే మాట.. ఆయనకు కేంద్రం సహకరించింది అని. అప్పట్లో టీడీపీని దూరం చేసుకుని.. వైఎస్ జగన్ ను దగ్గర చేసుకోవడంతోనే జగన్ ను విజయ లక్ష్మి వరించింది అంటూ చెప్తూ ఉంటారు. అయితే 2024 లో మాత్రం సీన్ తేడా కొట్టింది. జగన్ అంచనాలు ఫెయిల్ అయ్యాయి. రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారింది. కారణం కేంద్రం దూరం కావడమే. ఢిల్లీలో జగన్ కు క్రమంగా పట్టు తగ్గడమే.
Also Read : అధినేతపై గుర్రుగా క్యాడర్.. అసలున్నాడా..!
ఇప్పుడు ఆ పట్టు లేకపోవడం మరింత ఇబ్బంది పెడుతోంది.. ఏపీలో కూటమికి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంది. అందుకే ఇప్పుడు జగన్.. ఢిల్లీ స్థాయిలో మళ్ళీ బలోపేతం అయ్యే ప్రయత్నాలు వేగవంతం చేసారు. కేంద్ర పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టారు. విజయసాయి రెడ్డి దూరమైన తర్వాత.. జగన్ ఢిల్లీలో స్వేచ్చగా రాజకీయం చేయలేకపోతున్నారు. మిథున్ రెడ్డిని నమ్ముకున్నా.. ఆయన తన తండ్రిని, తనను కాపాడుకోవడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.
Also Read : అర్ధరాత్రి కొలంబోలో.. ఉదయం గన్నవరంలో.. ఆశ్చర్యపరిచిన లోకేష్..!
అందుకే ఇప్పుడు.. స్వయంగా తానే ఢిల్లీ వెళ్లాలని జగన్ భావిస్తున్నారు. కేంద్ర హోం శాఖా మంత్రిని కలిసే ప్లాన్ లో జగన్ ఉన్నట్టు రాజకీయ వర్గాలు అంటున్నాయి. కల్తీ లడ్డు వ్యవహారం, వైసీపీ నేతలపై నమోదు అవుతున్న కేసులు, అమరావతి వ్యవహారం సహా పలు అంశాలను అమిత్ షాకు ఫిర్యాదు చేసే యోచనలో జగన్ ఉన్నారట. ఇప్పటికే అమిత్ షా అపాయింట్మెంట్ జగన్ కోరారని, పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపే వెళ్లాలని జగన్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఏదోక రూపంలో కేంద్రానికి దగ్గర కాకపోతే తనకు ఇబ్బందేనని జగన్ ఆందోళనలో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

