Saturday, September 19, 2026 06:39 AM
Saturday, September 19, 2026 06:39 AM

పొత్తు నియమం పాటిస్తున్నట్లేనా..?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే ఏడాది కావొస్తోంది. చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు భాగస్వామ్యులుగా ఉన్నాయి. 2024 ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయడంతో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. కూటమిలో తెలుగుదేశం పార్టీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. కూటమి 164 స్థానాల్లో గెలవడంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అయితే ఎన్నికల ముందు నుంచే కొంత మంది వైసీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కూటమి గెలిస్తే తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఊహించేశారు. దీంతో నెమ్మదిగా దూకాణం సర్దేశారు.

Also Read : పెద్దిరెడ్డి టార్గెట్ గా పవన్ సంచలన అడుగులు

ఇక ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైలెంట్‌గా బెంగళూరు వెళ్లిపోయారు. కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో జరిగిన తప్పులపై ఉక్కుపాదం మోపుతోంది. మద్యం కుంభకోణంలో అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయి. దీంతో అధినేత అరెస్టు ఖాయమనే మాట ఇప్పుడు వైసీపీ నేతల్లో బాగా వినిపిస్తోంది. బాలినేని శ్రీనివాస్, ఆళ్ల నాని వంటి కొందరు సీనియర్లు అయితే.. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించినట్లున్నారు. అందుకే ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే సైలెంట్‌గా వైసీపీకి రాజీనామా చేసేశారు. అయితే ఇలాంటి వారంతా తమ రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన, బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇలాంటి వలస నేతల కోసం తెలుగుదేశం పార్టీ ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. గతంలో వైసీపీలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బందులు పెట్టిన వారిని చేర్చుకునే విషయంలో కూటమి పార్టీలోని మిగిలిన వారి అభిప్రాయం తీసుకోవాలని సూచించింది.

Also Read : ఏపీ లిక్కర్ స్కాం.. ఆధారాలన్నీ హైదరాబాద్ లోనే..?

తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ జకియా ఖానం సైలెంట్‌గా బీజేపీలో చేరిపోయారు. వాస్తవానికి జకియా ఖానం రాజీనామా చేసే వరకు ఆమె వైసీపీలో ఉన్నట్లు ఎవరికీ తెలియదు కూడా. ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ విమర్శలు చేసినట్లుగా కూడా తెలియటం లేదు. జకియా ఖానం రాజీనామా చేసిన వెంటనే ఆమె గురించి నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేస్తూనే ఉన్నారు. గతంలో ఈమె టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను ఏమైనా అన్నారా.. వాళ్లను ఘాటుగా ఏమైనా విమర్శించారా అని టీడీపీ, జనసేన పార్టీ నేతలు తెగ సెర్చింగ్ చేస్తున్నారు. మండలిలో కూడా జకియా ఖానం మాట్లాడిన వీడియోలు నెట్‌లో దొరకటం లేదు. దీంతో చాలా మంది టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇక్కడే కొందరు మాత్రం ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే జకియా ఖానం బీజేపీలో చేరిపోయారు. మరి జకియా ఖానం చేరిక గురించి టీడీపీ, జనసేన పార్టీ నేతలను బీజేపీ నేతలు సంప్రదించారా లేదా.. కూటమి పొత్తు నియమం పాటిస్తున్నారా లేదా.. అనే ప్రశ్నలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్