ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ కొత్త రూపంలో విరుచుకుపడుతోందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. అమెరికాలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన సరికొత్త సబ్‌వేరియంట్ BA.3.2 వేగంగా వ్యాపిస్తోందని అక్కడి మీడియా ప్రకటించింది. దీనికి ‘సికాడా’ వేరియంట్ గా నామకరణం చేసారని.. ప్రస్తుతం అమెరికా అంతటా వేగంగా విస్తరిస్తోందని అమెరికన్ మీడియా పేర్కొంది. ఒమిక్రాన్ సంతతికి చెందిన BA.3.2 అనే సబ్‌వేరియంట్ ఇప్పుడు అమెరికాలో వేగంగా వ్యాపిస్తోంది.
Also Read : అమరావతి అంటే జగన్ కి కంపరం.. బాబు కీలక వ్యాఖ్యలు
2024 చివరిలో దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా వెలుగుచూసిన ఈ వేరియంట్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనీసం 23 దేశాలకు పాకిందట. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అందించిన సమాచారం ప్రకారం, ఈ సికాడా వేరియంట్ స్పైక్ ప్రోటీన్ లో కీలక ఉత్పరివర్తనాలు జరిగాయట. దీనివల్ల గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్ ద్వారా పొందిన సహజ రోగనిరోధక శక్తిని లేదా వ్యాక్సినేషన్ ద్వారా లభించిన రక్షణను కూడా ఇది సులభంగా తప్పించుకోగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : వైసీపీ నేతలు డబుల్ గేమ్.. వాటి విషయం ఏమైంది..?
అమెరికాలో అడుగుపెట్టిన నలుగురు ప్రయాణికులలో ఈ వేరియంట్ ను మొదటిసారిగా గుర్తించారు. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే ఇది 29 రాష్ట్రాలకు విస్తరించింది. కేవలం రోగులలోనే కాకుండా, ఆయా రాష్ట్రాల్లోని మురుగునీటి కాలువల్లో కూడా ఈ వైరస్ అవశేషాలను గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. 2025 సెప్టెంబర్ నుండి అమెరికాలో కేసులు పెరుగుతున్నప్పటికీ, ఇది ఇంకా ప్రపంచవ్యాప్తంగా డామినెంట్ వేరియంట్‌గా మారలేదు. అయితే దీని వ్యాప్తి వేగం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇది పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

