అన్నకు మూడు అంటే అంత ఇష్టమా.. ఇప్పుడు ఇదే ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తోంది. ఇంతకు అన్న ఎవరూ అనే కదా అనుమానం.. ఎవరో కాదు.. వైసీపీ నేతలంతా ముద్దుగా అన్న పిలుచుకునేది ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. నెలకో సారి మీడియా ముందుకు వస్తారు.. వచ్చినప్పుడు మీమర్స్‌కు మంచి ఫుటేజ్ ఇచ్చి వెళ్తారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై ప్రెస్‌మీట్ పెట్టారు.. ఇంకా చెప్పాలంటే.. ప్రెస్ ముందుకు వచ్చారు.. తప్ప.. మీడియా మిత్రులు ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వలేదు.
Also Read : అమరావతి అంటే జగన్ కి కంపరం.. బాబు కీలక వ్యాఖ్యలు
నిజానికి జగన్ అంటే.. 2019 ముందు.. 2019 తర్వాత అని రాజకీయాల్లో పేరు. ఆయన సమావేశాలు, సభలు చూస్తే.. ఈ తేడా క్లియర్‌గా తెలుస్తుంది. 2014 ఎన్నికలప్పుడు, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో, పాదయాత్ర సమయంలో, మళ్లీ 2019 ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రసంగాలు సూటిగా, స్పష్టంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యల ప్రస్తావనలో కానీ.. పాదయాత్రలో స్థానిక నేతలపై విమర్శలు కానీ.. గట్టిగానే చేశారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మారిపోయాడు. అది ఎంతలా అంటే.. మాట మాట్లాడాలి అంటే.. ఎవరో రాసివ్వాల్సిందే. ఇదే విషయం కరోనా సమయంలో రికార్డెడ్ వీడియోను ప్రెస్ మీట్ అని మీడియాకు రిలీజ్ చేశారు. ఇక ఎన్నికల ప్రచారంలో కూడా జగన్ ప్రసంగం అంతా తడబాటులే.
ఇక 2024 ఎన్నికల్లో ఓడిన తర్వాత జగన్ పూర్తిగా మారిపోయారు. చెప్పాలంటే.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదివేసి.. వెళ్లిపోతున్నారు. ఎవరైనా మీడియా మిత్రులు ప్రశ్నలు వేస్తే.. జవాబు చెప్పటం లేదు కూడా. ఇక జగన్ తాజాగా రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానంపై ప్రెస్ ముందుకు వచ్చారు. రాజధాని అంశం ప్రస్తావిస్తూ.. మావిగన్ అంటూ వింత వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటూ మరోసారి మూడు ఊర్లు అంటూ వింత వాదన చేశారు. దీంతో జగన్‌కు మూడు అంటే అంత ఇష్టమా అనే పేరు వినిపిస్తోంది.
Also Read : జనసేన బలహీనమవుతుందా.. బలపడుతుందా..!
జగన్‌కు 3 సెంటిమెంట్ బాగా ఉన్నట్లుంది. అందుకే లోటస్‌పాండ్, ఎలహంక, తాడేపల్లిలో ప్యాలెస్‌లు కట్టుకున్నారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ విశాఖ, కర్నూలు, అమరావతి పేర్లు ప్రకటించారు. ఆ ప్లాన్ బెడిసికొట్టింది. ఇక ఎన్నికల్లో ఓడిన తర్వాత తాడేపల్లి నుంచి ఎలహంక ప్యాలెస్‌కు మారిన జగన్.. ఇప్పుడు వారంలో మూడు రోజులు మాత్రమే తాడేపల్లికి వచ్చి వెళ్తున్నారు. ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటూ మరోసారి మూడు ఊర్ల పేర్లు ప్రస్తావించారు. దీంతో అసలు జగన్‌కు ఈ మూడుకు ఉన్న సంబంధం ఏమిటీ.. అని అంతా చర్చించుకుంటున్నారు.

