ఇరాన్ – ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉద్రిక్తల నేపధ్యంలో.. భారత్ కు చమురు రవాణా అనేది ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఎట్టకేలకు సౌదీలో బయల్దేరిన లైబీరియా నౌక భారత్ లోని ముంబైకి చేరుకుంది. ఈ టైంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఈ నౌక భారత్ కు చేరింది. ఈ నేపధ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం. ఈ నౌక బయల్దేరినప్పుడు ఏఐఎస్ ను ఆపేసింది. అంటే.. ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్.. ఇది ఓడలకు ఉండే ఒక రకమైన ‘డిజిటల్ గుర్తింపు కార్డు’ అలాగే ‘లైవ్ లొకేషన్ ట్రాకర్’ లాంటిది.
Also Read : ఏపీ అభివృద్ధికి అడ్డుగోడ వైఎస్ జగన్
వీహెచ్ఎఫ్ రేడియో తరంగాల ద్వారా ఓడ పేరు, దాని మోడల్, ఖచ్చితమైన స్థానం, వేగం, అది ఏ దిశలో వెళుతుందో నిరంతరం ఇతర నౌకలకు, తీర ప్రాంతాల్లోని కంట్రోల్ రూమ్ లకు తెలియజేస్తుంది. సముద్రంపై ప్రయాణించే నౌకలు ఒకదానికొకటి ఢీకొనకుండా ఉండటానికి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి అంతర్జాతీయ నిబంధనల ప్రకారం పెద్ద నౌకలన్నీ దీన్ని తప్పనిసరిగా వాడాలి. అయితే ఈ సిస్టంను భారత నౌక ఆపేసింది. మార్చి 2026లో సౌదీ అరేబియా నుండి ముడి చమురుతో వస్తున్న ‘షెన్లాంగ్’ అనే భారీ చమురు ట్యాంకర్, హార్మోజ్ జలసంధిని దాటే సమయంలో తన ఏఐఎస్ సిస్టం ను ఆపేసింది.
Also Read : పాండ్యా బిహేవియర్ పై విమర్శలు
దీనినే మెరైన్ భాషలో “గోయింగ్ డార్క్” అంటారు. దీనికి గల కారణాలు చూస్తే, ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఆ ప్రాంతంలో నౌకలపై దాడులు జరుగుతున్నాయి. ఏఐఎస్ ఆన్ చేసి ఉంటే శత్రువుల డ్రోన్లకు లేదా క్షిపణులకు నౌక ఎక్కడ ఉందో సులభంగా తెలిసిపోతుంది. గుర్తింపును దాచిపెట్టి సురక్షితంగా వెళ్లడానికి కెప్టెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రాంతంలో సిగ్నల్స్‌ను తప్పుదోవ పట్టించే చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనివల్ల తప్పుడు సమాచారం ప్రసారమయ్యే ప్రమాదం ఉన్నందున రక్షణ దృష్ట్యా సిస్టమ్ ఆపేయడం ఉత్తమమని భావించారు. హార్మోజ్ ఇక్కడ ‘సైలెంట్ మోడ్’లో ప్రయాణించడం వల్ల దాడుల ముప్పు తగ్గుతుంది.

