Monday, March 2, 2026 10:06 PM
Monday, March 2, 2026 10:06 PM

సోషల్ మీడియా లీక్ వీరులు ఎవరు..?

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు లీక్ చేసింది ఎవరు..? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కీలక పదవుల్లో ఉన్న వారు, రాజకీయ నాయకులు, అధికారులు, ఇతర రంగాల ప్రముఖులు ఎలా ఉండాలంటే.. వారి బలం అందరికీ తెలియాలి. కానీ వారికి ఎలాంటి బలహీనతలు ఉన్నా సరే.. అది వారికి మాత్రమే పరిమితం కావాలి. అంతే కానీ.. అవి బయటకు తెలిస్తే.. చాలా ప్రమాదం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యర్థులు బంతాట ఆడుకుంటారని ప్రముఖులు హెచ్చరిస్తున్నారు కూడా. నిజానికి మన శత్రువులు దూరంగా ఉన్నారని అనుకుంటాం. కానీ అదంతా మన భ్రమ మాత్రమే. “శత్రువులు ఎక్కడో ఉండర్రా..” అన్న రావు రమేశ్ డైలాగ్‌ మాదిరిగా.. నిత్యం మన చుట్టే ఉంటారు.

మన చుట్టూ ఉండే వారితో పాటు, కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సహాయకులు, బంధు మిత్రులతో పాటు ఆంతరంగికులే ఏదో ఒక రోజు మనల్ని బజారుకు లాగుతారు. మనల్ని అన్నివిధాలుగా భ్రష్టు పట్టిస్తారు. అలాగే ప్రముఖులకు కూడా మరో విధంగా శత్రువుల రూపంలో కొందరు ఉంటారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విషయంలో బయటపడింది. అలాంటి శత్రువులు ఉంటారని.. పాపం బీఆర్ నాయుడు కూడా ఎప్పుడు అనుకుని ఉండరు. ఇప్పుడు అనుభవంతో కానీ నాయుడు గారికి తెలిసిందేమో..! అసలు విషయానికొస్తే… టీవీ 5 చైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు.. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఒక మహిళతో ఎయిర్ పోర్టులో ఉన్న ఫోటో.. ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఎలా వచ్చింది..? అసలు ఆ ఫోటో అప్పట్లో ఎవరు తీశారు..? ఇవే ఇప్పుడు బాగా వినిపిస్తున్న ప్రశ్నలు.

Also Read : టార్గెట్ బీఆర్ నాయుడు.. డీప్ ఫేక్ తో వైసీపీ దారుణం

బీఆర్ నాయుడు ఓ మహిళతో ఎయిర్ పోర్టులో ఉన్న ఫోటో అంటూ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. అయితే దీని వెనుక పెద్ద కుట్ర ఉందనేది వాస్తవం. ఈ ఫోటో నిజమో కాదో తెలియదు కానీ.. ఆ ఫోటోను సోషల్ మీడియాలో వైసీపీ నేతలు, అనుకూల, అభిమాన మీడియా తెగ ప్రచారం చేస్తోంది. అయితే దీని వెనుక టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును ఏదో ఒక విధంగా అప్రతిష్ట పాలు చేసే పనినే పనిగా పెట్టుకున్నారని స్పష్టమవుతోంది. దీని వెనుక వైసీపీ తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారన్న అనుమానం కలుగుతోంది. అందుకు కారణం ఏమిటంటే టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని భూమన కరుణాకర్ రెడ్డి పదే పదే డిమాండు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. పదవిలోకి వచ్చిన తొలి రోజు నుంచే బీఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ భూమన డిమాండ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

నిజానికి బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ హోదాలో తిరుమలలో ఎలాంటి తప్పులు చేయలేదు. పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా.. ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. పైగా గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిచేస్తూ.. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చర్యలు చేపట్టారు. నిజానికి నాయుడుపై ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఇప్పుడు కూడా ఓ మహిళతో సన్నిహితం అంటూ ఆయన వ్యక్తిగత జీవితంపై ఆరోపణలు చేస్తున్నారు. ఇది నిజమే అనుకున్నా.. అది ఆయన కుటుంబ సభ్యులు, సదరు మహిళ కుటుంబ సభ్యుల వ్యక్తిగత వ్యవహారం. దానికి టీటీడీ చైర్మన్ పదవికి ఏమిటి సంబంధం..? పోనీ ఆ వీడియో, ఫోటోల్లో అసభ్యంగా, సన్నిహితంగా ఉన్నట్లు ఏమైనా ఉందా.. అంటే.. అదీ లేదు. ఎక్కడా నాయుడు వల్గారిటీ లేదు. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు, నడుస్తున్నారు. అది కూడా తప్పేనా..? అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట.

Also Read : అష్టగ్రహ కూటమి వేళ.. యుద్ధ జ్వాలల్లో పశ్చిమాసియా!

బీఆర్ నాయుడుకు, మహిళకు మధ్య సంబంధం ఉంటే.. ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. పోనీ.. ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టింది ఎవరు..?.. ఆ మహిళే తన ఇంట్లో స్వయంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారా..?.. లేక సెల్ ఫోన్‌లో రికార్డు చేశారా..?.. అలా ఎందుకు చేశారు..? ఇంతకీ ఆ మహిళ ఎవరు..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి. కానీ వైసీపీ నేతలు మాత్రం.. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా మీడియా ముందుకు, అనుకూల మైకులు ముందుకు, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వీడియో, ఫోటోలను పదే పదే ప్రచారం చేయడం చూస్టుంటే.. ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగినట్లుగా తెలుస్తోంది.

నిజానికి అసభ్యంగా ప్రవర్తించడం అంటే.. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్.. అలాంటి పనులు చేసినట్లు రుజువులతో సహా దొరికిపోయినా సరే.. (అప్పట్లో డీప్ ఫేక్ ఇంకా అందుబాటులోకి రాలేదు) తమ పార్టీ ఎంపీ కాదనీ.. అసలు ఆ వీడియో నిజమే కాదని అప్పట్లో వైసీపీ నేతలు తెగ బుకాయించారు. ఇక ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి తానే మార్గదర్శి అన్నట్లుగా తనకు తాను చెప్పుకుంటున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు.. గంటేనా అంటూ సంజన, సుకన్య ఫోన్ కాల్.. (మాట్లాడినట్లు రాంబాబు ఒప్పుకున్నారు కూడా) బయటకు వచ్చినా కూడా.. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరి కదా.. ఆయనకు ఆ తర్వాత మంత్రిపదవి ఇచ్చారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

Also Read : కనిమొళికి, కవితకు జరిగిన న్యాయం.. అయేషా మీరాకు జరగలేదేం..?

ఆ రోజు తమ పార్టీ నేతలు అడ్డంగా దొరికినా కూడా.. చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు కనీసం అడగలేదు. పైగా అది వారి వ్యక్తిగత విషయం అంటూ బుకాయించారు కూడా. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో బీఆర్ నాయుడు ఫోటోలు, వీడియోలు నిజమే అయితే.. అది ఆయన వ్యక్తిగత జీవితం కాదా..? అనేది సగటు తెలుగు వాడి ప్రశ్న. ఇంత కు అలాంటి ఫొటోలు ఎప్పుడు, ఎవరు తీసారో..? ఆ ఫొటోలను ముచ్చటపడి ఎందుకు దాచుకున్నారో..? ఇప్పడు వైసీపీ నాయకులకు ఎవరు ఇచ్చారు..? ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ జరిపితే తెర వెనుక సూత్రధారులు.. తెర ముందు పాత్రధారుల గుట్టు రట్టు అవ్వటం ఖాయం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏఐ డీప్‌ఫేక్ కలకలం...

సాంకేతికతను ఆసరాగా చేసుకుని మహిళల గౌరవానికి...

మహిళలకు ఏపీ సర్కార్...

ఏపీ ప్రభుత్వం పరిపాలనలో వేగం పెంచి,...

మహిళా దినోత్సవ కానుకగా...

ఏపీలో మహిళల సాధికారతకు కూటమి ప్రభుత్వం...

ప్లీజ్.. అతన్ని రీప్లేస్...

ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా...

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న...

- ఏపీ ఎన్నార్టీ కో ఆర్డినేటర్ల...

టార్గెట్ బీఆర్ నాయుడు.....

తిరుమల విషయంలో మరో వివాదం ఇప్పుడు...

పోల్స్