Saturday, February 28, 2026 09:14 PM
Saturday, February 28, 2026 09:14 PM

ఇంత జరుగుతున్నా.. ఆయనెక్కడా..?

ఇంత జరుగుతున్నా.. ఆయనెక్కడా..? ఇప్పుడు ఇదే మాట ఏపీ రాజకీయాల్లో బాగా వినిపిస్తోంది. ఇంతకీ ఆయనెవరో తెలుసా.. ఆయనే మాజీ మంత్రి, శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించి.. మంత్రి స్థాయి వరకు ఎదిగారు తమ్మినేని. 1995 ఆగష్టు సంక్షోభంలో చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. ఇక బీసీ కోటాలో చంద్రబాబు మంత్రివర్గంలో కీలక శాఖలను నిర్వహించారు. అయితే ఏం జరిగిందో ఏమో.. తెలియదు కానీ.. 2009 ఎన్నికల ముందు ప్రజారాజ్యం పార్టీలో చేరారు. దీంతో ఆయన మేనల్లుడు కూన రవికుమార్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. నాటి నుంచి మేనమామ-మేనల్లుడి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.

Also Read : అన్న వాకింగ్ అంటే.. మామూలుగా ఉండదు మరి..!

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం తర్వాత తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరిన తమ్మినేని.. 2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించారు. అయితే చంద్రబాబు మాత్రం కూన రవికే ప్రాధాన్యత ఇవ్వడంతో.. చంద్రబాబుపై అలిగిన తమ్మినేని మళ్లీ వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిన తమ్మినేని.. 2019లో గెలిచిన తర్వాత మంత్రిపదవి ఆశించారు. కానీ జగన్ మాత్రం స్పీకర్ పదవితో సరిపెట్టారు. పదవిలో ఉన్న ఐదేళ్లు చంద్రబాబుపై ఒంటికాలితో విమర్శలు చేశారు. చివరికి సభాపతి హోదాలోనే బూతులతో రెచ్చిపోయారు. శాసనసభలో వైసీపీ సభ్యులు చంద్రబాబు వ్యక్తిత్వ హననం చేస్తున్నా.. భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా.. తమ్మినేని ఖండించలేదు.

2024 ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరినప్పటికీ.. జగన్ మాత్రం సీతారామ్ పేరు ప్రకటించారు. ఈ ఎన్నికలో మేనల్లుడి చేతిలో ఓడిన సీతారాం.. ఆమదాలవలస నియోజకవర్గంతో పాటు శ్రీకాకుళం జిల్లాకు కూడా దూరమయ్యారు. అప్పుడప్పుడు జిల్లాలో తళుక్కుమంటున్నప్పటికీ.. పార్టీ కార్యక్రమాలకు, నేతలకు కూడా దూరంగా ఉంటున్నారు. కొన్ని రోజులు తన కుమారుడి ఆరోగ్యం బాలేదన్న తమ్మినేని.. ఆ తర్వాత తాను వైసీపీలోనే కొనసాగుతున్నా.. అంటూ ప్రకటించారు. కానీ.. ఆ పార్టీలో చురుగ్గా లేరు అనేది జిల్లాలో జోరుగా జరుగుతున్న చర్చ.

తాజాగా తమ్మినేని తీరుపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఏపీలో రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. ఓ వైపు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం.. అసెంబ్లీ సమావేశాల రగడ, తాజాగా శ్రీకాకుళంలో డయేరియా వైరస్.. ఇన్ని గొడవలు జరుగుతున్నా కూడా.. తమ్మినేని కనీసం స్పందించటం లేదు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. శ్రీకాకుళం పట్టణంలో డయేరియా వల్ల ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. దీనిపై వైసీపీ నేతలు వరుస పర్యటనలు చేస్తున్నారు.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. చివరికి శివారు నియోజకవర్గాలైన పలాస, ఇచ్ఛాపురం నుంచి కూడా వైసీపీ నేతలు శ్రీకాకుళం వచ్చి పరామర్శ, రాజకీయ విమర్శలు చేశారు. కానీ.. పక్కనే పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ్మినేని మాత్రం కనీసం కనిపించలేదు.

Also Read : ప్రముఖ కంపెనీలో సగం మంది ఉద్యోగులు అవుట్..!

తమ్మినేని తీరుపై ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తోంది. ఆమదాలవలస నియోజకవర్గం బాధ్యతల నుంచి తమ్మినేనిని తప్పించిన జగన్.. ఆ బాధ్యతలను చింతాడ రవికి అప్పగించారు. రాబోయే ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తారనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఎంపీగా పోటీ చేయడం తనకు ఇష్టం లేదని తమ్మినేని తన వర్గం నేతల దగ్గర ఇప్పటికే స్పష్టం చేశారు. అదే సమయంలో చింతాడ రవికి కూడా దూరంగా ఉన్నారు. అసలు ఇంత గొడవ జరుగుతున్నా కూడా తమ్మినేని ఏమయ్యారు అనే చర్చ జోరుగా నడుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్ : కాకినాడలో...

ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోర ప్రమాదం...

కనిమొళికి, కవితకు జరిగిన...

ఆయేషా మీరా హత్య కేసు.. తెలుగు...

ఢిల్లీలో స్వామిని యాక్టివేట్...

ప్రాంతీయ పార్టీలు వారి వారి రాష్ట్రాల్లో...

బీఆర్ఎస్, బిజెపిలకు బులెట్...

గత నాలుగేళ్ల నుంచి సంచలనంగా మారిన...

అన్న వాకింగ్ అంటే.....

"మరో ఏడాదిన్నరలో నా పాదయాత్ర మొదలవుతుంది."...

పయ్యావుల వర్సెస్ మండలి...

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రాజకీయం హాట్...

పోల్స్