Wednesday, May 6, 2026 11:14 PM
Wednesday, May 6, 2026 11:14 PM

వాట్సాప్ సేఫ్ కాదా..? యూఎస్ కోర్ట్ లో సంచలనం..!

సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్ పాత్ర ఎంతో కీలకం. వ్యక్తుల నుంచి వ్యవస్థలు, ప్రభుత్వాల వరకు వాట్సాప్ కీలకంగా మారింది. మరి అలాంటి వాట్సాప్ లో సమాచారం భద్రమేనా..? గత నాలుగేళ్ళుగా దీనిపై ఎంతో ఆందోళన వ్యక్తమవుతోంది. తాము భద్రత విషయంలో కఠినంగా ఉంటామని వాట్సాప్ చెప్తున్నా.. అనుమానాలు మాత్రం తొలగిపోవడం లేదు. యాప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ ఉన్నప్పటికీ మాతృ సంస్థ మెటా ప్రైవేట్ మెసేజ్ లను యాక్సెస్ చేయగలదని అంతర్జాతీయ వాట్సాప్ వినియోగదారుల బృందం అమెరికా కోర్టులో దావా వేసింది.

Also Read : గెట్ అవుట్.. అసలు తప్పు ఎవరిదీ..?

శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో దాఖలు చేసిన దావాలో, వాట్సాప్ చెప్పే సెక్యూరిటీ ఫీచర్ కేవలం బూటకం అంటూ కొట్టిపారేశారు. తమకు నష్టపరిహారం చెల్లించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే, మెటా ఈ వాదనలను తప్పుడు వాధనలుగా కొట్టిపారేసింది. వాట్సాప్ చెప్పే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మెసేజ్ లను పంపినవారు, వాటి గ్రహీతలు మాత్రమే యాక్సెస్ చేసే అవకాశం ఉందని వాట్సాప్ చెప్తుంది. దానికి సంబంధించిన ఎన్‌క్రిప్షన్ కీలు వినియోగదారుల డివైజ్ లోనే ఉంటాయి. కాబట్టి వాటిని మెటా డీక్రిప్ట్ చేసే అవకాశం లేదని చెప్తోంది.

Also Read : డైట్ కంటే టైం ముఖ్యమా..? డాక్టర్ సంచలన విషయాలు..!

బ్లూమ్‌ బెర్గ్ ప్రకారం, జనవరి 23న దాఖలు చేసిన ఈ దావాలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, మెక్సికోకు చెందిన వినియోగదారులు ఉన్నారు. వినియోగదారుల సందేశాలను చదవడానికి వాట్సాప్ ఉద్యోగులు యాప్ యొక్క ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను క్రాస్ చేసే అవకాశం ఉందని ఆరోపించారు. అయితే, దావాలో వాదనలకు మద్దతు ఇచ్చే సాంకేతిక ఆధారాలు లేవు. గతంలో ఎలాన్ మస్క్ కూడా వాట్సాప్ సెక్యూరిటీపై ఆందోళన వ్యక్తం చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్