Wednesday, February 25, 2026 03:57 AM
Wednesday, February 25, 2026 03:57 AM

ఒక్క మ్యాచ్ తో సీన్ మారిపోయింది.. భారత్ సెమీస్ చేరాలంటే..?

టి20 వరల్డ్ కప్ లో భారత్ కు కష్ట కాలం మొదలైంది. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో ఓటమితో తొలి దెబ్బ తగిలితే.. వెస్టిండీస్ భారీ విజయం సాధించడంతో ఊహించని షాక్ తగిలింది. ఏకంగా 107 పరుగుల తేడాతో విండీస్ జట్టు జింబాబ్వే పై భారీ విజయాన్ని నమోదు చేసింది. దీనితో టీ20 ప్రపంచ కప్ లో సెమీఫైనల్‌కు చేరుకునే భారత్ అవకాశాలకు మరో దెబ్బ తగిలింది. దీనితో తదుపరి మ్యాచ్ లలో భారత్ భారీ తేడాతో విజయం సాధించి నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది.

Also Read : పెద్దల సభ బరిలో బీఆర్ఎస్.. గేమ్ ప్లాన్..!

బుధవారం చెన్నైలో భారత్ తన తదుపరి మ్యాచ్‌ లో జింబాబ్వేతో తలపడుతుంది. అదే రోజు, గ్రూప్ 1లోని మరో మ్యాచ్‌ లో దక్షిణాఫ్రికా అహ్మదాబాద్‌ లో వెస్టిండీస్‌ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఫలితంపైనే భారత సెమీఫైనల్ ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే భారత్ కు పెద్దగా ఇబ్బంది ఉండదు. వెస్టిండీస్, జింబాబ్వేలతో జరిగే మిగిలిన రెండు మ్యాచ్‌ లలో భారత్ గెలిస్తే, 3 మ్యాచ్‌లలో 4 పాయింట్లు ఉంటాయి. దక్షిణాఫ్రికా తమ తదుపరి రెండు మ్యాచ్ లలో గెలవాల్సి ఉంటుంది.

Also Read : ఆఫ్ ది రికార్డు వార్తలు.. పార్ట్ 3..!

అప్పుడు భారత్ కు ఇబ్బంది ఉండదు. అలా కాకుండా దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌ తో జరిగే మ్యాచ్ లో ఓడిపోతే, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, భారత్ లకు చెరో 4 పాయింట్లు ఉంటాయి. అప్పుడు నెట్ రన్ రేట్ ఇక్కడ కీలకం అయ్యే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా తమ మిగిలిన రెండు మ్యాచ్‌ లలో ఓడిపోతే, భారత్, వెస్టిండీస్ అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే భారత్.. వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో గెలవాలి. దక్షిణాఫ్రికా తమ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి, భారత్.. వెస్టిండీస్‌ ను ఓడించి జింబాబ్వే చేతిలో ఓడిపోతే, మూడు జట్లు – ఇండియా, జింబాబ్వే, వెస్టిండీస్ లకు చెరో 2 పాయింట్లు కలిగి ఉంటాయి. నెట్ రన్ రేట్ ఇక్కడ సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేస్తుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జగన్ ను తిట్టోద్దని...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కల్తీ లడ్డు వ్యవహారంపై...

అందరి జాతకాలు బయటపెడతా..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్...

ప్లాన్ ప్రకారమే అంతా.....

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

తిరుమల పవిత్రతకు ప్రత్యేక...

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిరక్షణపై...

మరో వివాదంలో మోహన్...

గత రెండు మూడేళ్ళ నుంచి సినీ...

ఆఫ్ ది రికార్డు...

గుంటూరు మిర్చి యార్డు అంటే ఉమ్మడి...

పోల్స్