Saturday, September 19, 2026 08:16 AM
Saturday, September 19, 2026 08:16 AM

రంగన్న శరీరంలో 20 నమూనాలు.. పోలీసులు కీలక విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న మృతి వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. వరుసగా సాక్షులు ప్రాణాలు కోల్పోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుని విచారణకు ఆదేశించింది. రంగన్న మృతదేహానికి ప్రస్తుతం… తిరుపతిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు.. ఇటీవల తిరుపతి నుంచి నలుగురు వైద్యుల బృందం… పులివెందుల వెళ్లి వాచ్మెన్ రంగన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది.

Also Read : పొలిటికల్ కెరీర్‌పై తేల్చేసిన బాలినేని..!

ఈ మృతదేహానికి పలు పరీక్షలను కూడా వైద్యులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దాదాపు 20 నమూనాలను అతని శరీరంలో గుర్తించినట్లు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కాలేయంతో పాటుగా మూత్రపిండాల్లో కూడా విష నమూనాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అతను అస్వస్థత గురైన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో… ఎవరున్నారు ఏంటి అనేదానిపై కూడా ఇప్పుడు పోలీసు వర్గాలు విచారణ రహస్యంగా జరుపుతున్నట్లు తెలుస్తోంది. భాకరాపేట నుంచి పులివెందుల తీసుకెళ్లే సమయంలో దారిలో ఎవరైనా కలిసారా అనే దానిపై విచారణ జరుపుతున్నారు.

Also Read : ప్రజాక్షేత్రంలోకి జగన్.. జవాబు చెప్పాలన్న టీడీపీ..!

లేదంటే అతని ఇంటికి అంతకు ముందు ఎవరైనా వచ్చారా… అనే దానిపై కూడా పోలీసు వర్గాలు విచారణ వేగవంతం చేసినట్లు సమాచారం. వాచ్మెన్ రంగన్న ఇంటి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే వాళ్ళని కూడా పోలీసులు విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తరచుగా అతని ఇంటికి ఎవరు వస్తారు… లేదా అతను ఎక్కడికైనా వెళ్తాడా.. అతని కుటుంబ సభ్యులు ఎవరితో సన్నిహితంగా ఉంటారు అనే అంశాలను కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ పోస్టుమార్టం నివేదిక ఎప్పుడు వస్తుంది ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్