Sunday, October 19, 2025 05:25 PM
Sunday, October 19, 2025 05:25 PM
roots

దారిలోకి వచ్చిన ట్రంప్.. భారత్ కు అమెరికా ప్రతినిధులు..!

భారత్, అమెరికా దేశాల మధ్య సుంకాల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. రష్యాతో భారత్ చమురు వాణిజ్యం కారణంగా ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. రెండు దఫాలుగా భారత్ పై 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని వారాల తర్వాత.. కీలకమైన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి అమెరికా ఆసక్తి చూపింది. భారత్ – అమెరికా మధ్య మంగళవారం దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. అమెరికా ప్రతినిధి బృందం ఇప్పటికే ఢిల్లీ చేరుకుంది.

Also Read : టీం ఇండియా కొత్త స్పాన్సర్ ఎవరంటే..?

సుంకాలు విధించడంతో భారత్ తమ దారికి వస్తుందని అంచనా వేసిన ట్రంప్ సర్కార్.. చైనా, రష్యాకు దగ్గర కావడంతో మళ్ళీ భారత్ ను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భారత్ తో సంబంధాలు కాపాడుకోవాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఢిల్లీలో జరగనున్న చర్చల్లో దక్షిణాసియాకు అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ అమెరికా తరపున నాయకత్వం వహిస్తుండగా, వాణిజ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి రాజేష్ అగర్వాల్ భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారని జాతీయ మీడియా కథనం ప్రచురించింది.

Also Read : వరల్డ్ వైడ్ గా మిరాయ్ డామినేషన్.. సెంచరీ మార్క్ పక్కా..!

ఈ చర్చల్లో విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా పాల్గొంటోంది. ఈ చర్చల తర్వాత కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గత వారం, ట్రంప్ భారతదేశంతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి సిద్దంగా ఉన్నామని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఈ ఒప్పందం భవిష్యత్తులో మరిన్ని ఒప్పందాలకు వేదిక కాబోతుందని పేర్కొన్నారు. కాగా ఆగస్టు 27న అమల్లోకి వచ్చిన సుంకాల కారణంగా ఈ చర్చలు సందేహంలో పడ్డాయి. ఇక ఇప్పటికే ఐదు రౌండ్ల చర్చలు జరిగాయి. ఇక ఆరవ రౌండ్ చర్చలు ఆగస్టు 25 నుండి 29 వరకు జరగాలని నిర్ణయించినా.. సుంకాల కారణంగా నేటికి షెడ్యూల్ చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్