ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన లడ్డు కల్తీ వ్యవహారంపై ఏపీ శాసన సభలో లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ సహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తిరుమల నెయ్యి టెండర్లో నిబంధనలు మార్చారు… నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు వదిలారని మండిపడ్డారు. అప్పట్లోనే నెయ్యి నాణ్యతపై ఫిర్యాదులు వచ్చాయని, 2022లోనే సీఎఫ్టీఆర్ఐ నివేదిక ఇచ్చినా నాటి ఛైర్మన్ ఆ నివేదికను తొక్కిపెట్టారని మండిపడ్డారు.
Also Read : పాపం వైసీపీ.. అప్పుడు.. ఇప్పుడు ధర్నాలే..!
నిబంధనలను గాలికి వదిలేయడం వల్లే అనర్హత కంపెనీలకు నెయ్యి సరఫరా చేసే అవకాశం లభించిందని, ఓ పద్దతి ప్రకారం చాలా స్పష్టంగా దేవునికి అపచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. 2022లోనే కల్తీ అని తేలినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది… కానీ వాళ్లు చర్యలు తీసుకోలేదన్నారు చంద్రబాబు. మేం అధికారంలోకి వచ్చాక టీటీడీలో ప్రక్షాళన చర్యలు తీసుకున్నామన్న చంద్రబాబు.. ఈవో నెయ్యి శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపారని, జులై 23, 2024లో ఎన్డీడీబీ రిపోర్టులో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారని, ఈ రిపోర్ట్ ఆధారంగానే నేను కల్తీ నెయ్యి విషయంపై మాట్లాడానన్నారు.
Also Read : ఒక్క మ్యాచ్ తో సీన్ మారిపోయింది.. భారత్ సెమీస్ చేరాలంటే..?
ఇక డిప్యూటి సిఎం పవన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీకి పాల్పడింది.. లడ్డూ కల్తీపై నేను దీక్ష చేశానని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిలో అసలు నెయ్యే లేదని తేలిందని, గత ప్రభుత్వంలో అరాచకానికి ఇన్నోవేషన్ చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వాధినేత తప్పు చేశారని నేనెక్కడా చెప్పలేదు.. గత టీటీడీ బోర్డుదే తప్పని చెప్పానన్నారు. కల్తీ జరిగిందని ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరం ఉండేది కాదు.. గత టీటీడీ బోర్డులోని వారిని ఎందుకు వెనకేసుకొస్తున్నారు..? అని నిలదీశారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు కుట్ర జరిగిందని సిట్ తేల్చిందన్నారు.

