Sunday, June 21, 2026 11:16 AM
Sunday, June 21, 2026 11:16 AM

ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఆ ఉత్పత్తులపై 100 శాతం సుంకాలు

సుంకాల పేరుతో ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. అమెరికన్ కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ట్రంప్ విదేశీ కంపెనీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. పదేపదే సుంకాల పేరుతో విదేశాలతో పాటుగా ప్రముఖ పారిశ్రామిక సంస్థలను కూడా ఆయన బెదిరించడం చూస్తూనే ఉన్నాం. తనతో సన్నిహితంగా ఉండే దేశాల విషయంలో కూడా ట్రంప్ ఇదే వైఖరిని ప్రదర్శిస్తూ తలనొప్పి తెస్తున్నారు.

Also Read : ఆ ఇద్దరి మధ్య మళ్లీ వార్ మొదలైందా..?

తాజాగా మరో కీలక నిర్ణయం దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఫార్మా మందులపై భారీ సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బ్రాండెడ్ మందులతో పాటుగా ఇతర మందులకు 100% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. అయితే అమెరికాలో ప్లాంట్లను నిర్మిస్తున్న విదేశీ సంస్థల మందులకు మాత్రం దీనిని మినహాయించారు. అలాగే భారీ ట్రక్కులు సహా కొన్ని ఉత్పత్తులపై 30 శాతం వరకు సుంకాలు విధించారు అమెరికా అధ్యక్షుడు. ఈ మేరకు సోషల్ మీడియాలో కీలక ప్రకటన చేశారు ట్రంప్.

Also Read : లోకేష్ సాయం.. పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు..!

అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ట్రంప్ ఎనౌన్స్ చేశారు. అలాగే కిచెన్ ఉపకరణాలకు సంబంధించి కూడా సుంకాలను దాదాపు 50% విధించారు. అలాగే గల్ఫ్ దేశాల విషయంలో సుంకాలను మరింత పెంచే ఆలోచన ట్రంప్ కు ఉందని అమెరికా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక భారత విషయంలో విధించిన 50% సుంకాల్లో 25% సుంకాలు తగ్గించవచ్చని భావిస్తున్నారు. నవంబర్ నుంచి ఈ తగ్గింపులు ఉండే అవకాశం కనబడుతోంది. ఈ ప్రభావం భారత ఫార్మా రంగంపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఇక ఇటీవల హెచ్ 1 బీ వీసాల విషయంలో కూడా ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్