Thursday, February 12, 2026 12:24 PM
Thursday, February 12, 2026 12:24 PM

బిల్డప్ అదుర్స్.. బొమ్మ అట్టర్ ఫ్లాప్..!

అసెంబ్లీకి జగన్.. కూటమిలో వణుకు..! ఈ టైటిల్ చూసిన వాళ్లంతా అవునా.. నిజమా అని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. గోదారోళ్ల వెటకారం కాస్త జోడించి.. అవునవును అసెంబ్లీలో ఏసీల వల్ల కూలింగ్ ఎక్కువయ్యి కూటమి నేతలు వణికిపోతున్నారేమో.. అని వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. సరిగ్గా 15 రోజుల క్రితం తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు కూడా ఆ పార్టీ అధినేత కేసీఆర్ గురించి ఇలాంటి ఎలివేషన్స్ ఇచ్చారు. “మా పెద్ద సార్ సభకు వస్తుండు.. ఇక మీకు ఉంటది..” అని పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు. ఇక “కేసీఆర్ ఫామ్‌హౌజ్ నుంచి బయలుదేరాడు, నందినగర్ ఇంటికి వచ్చారు.. కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు.. కేసీఆర్ అసెంబ్లీలో కాలు పెట్టాడు.. కేసీఆర్ దగ్గరకు రేవంత్ రెడ్డి వచ్చి నమస్కారం చేశాడు.. ఇది మా సార్ రేంజ్ అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కానీ చివరికి పట్టుమని పది నిమిషాలు కూడా కేసీఆర్ తన స్థానంలో కూర్చోలేదు. స్పీకర్‌కు నమస్కారం చేసి సభ నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయారు. అంతే తప్ప.. నోరు విప్పి.. అధ్యక్షా అని కూడా అనలేదు.

Also Read : వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు..!

ఇప్పుడు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా సేమ్ ఇలాగే జరిగింది. అసెంబ్లీకి జగన్.. కూటమిలో వణుకు అంటూ వైసీపీ కరపత్రం సాక్షి పత్రికలో, ఛానల్‌లో తెగ ఊదరగొట్టారు. ఇక వైసీపీ నేతలైతే.. మా అన్న అంటే కూటమి నేతలకు హడల్.. ఆయన సభలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తారు కాబట్టే.. ఆయనకు ప్రతిపక్షహోదా ఇవ్వటం లేదు అంటూ మీడియా ముందు తెగ హడావుడి చేశారు. అసెంబ్లీకి జగన్.. టెన్షన్‌లో టీడీపీ అంటూ థంబ్ నెయిల్ పెట్టి మరీ హైప్ చేశారు. కల్తీ నెయ్యి గురించి టీడీపీ నేతలను కడిగిపారేస్తారని, రాష్ట్రంలో రైతుల సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తారని పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్పారు. తీరా చూస్తే.. బొమ్మ తేడా పడింది.

ఇటీవల ఓ పాన్ ఇండియా స్టార్ సినిమా హీరోగా వచ్చిన భారీ బడ్జెట్ సినిమాకు దర్శక నిర్మాతలు పెద్ద ఎత్తున ఎలివేషన్ ఇచ్చారు. మా సినిమా కలెక్షన్ ఎంతో తెలుసా..? అంటూ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పెద్ద పెద్ద డైలాగులు వేశారు. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాతే తెలిసింది.. అందులో అంత సీన్ లేదని. గతంలో సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో తర్వవాత బాక్సులు వెనక్కి వచ్చినట్లుగా.. జగన్ అసెంబ్లీ యాత్ర సాగింది. అలా వెళ్లి.. ఇలా వచ్చేశారు. గవర్నర్ ప్రసంగం మొదలైన వెంటనే.. అసలు అందులో ఏముందో కూడా వినకుండానే.. గవర్నర్ ప్రసంగంలో అన్ని అసత్యాలు, గవర్నర్‌తో తప్పుడు ప్రసంగం అంటూ గగ్గొలు పెట్టి.. సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. 23 మంది ఎమ్మెల్యేలున్నప్పుడు కూడా టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగం పూర్తిగా విన్న తర్వాతే నినాదాలు చేశారు. ఆ రోజు గవర్నర్ ప్రసంగం వైసీపీ ప్రభుత్వానికి అనుకూలం. ఇప్పటి గవర్నర్ ప్రసంగం కూటమి సర్కార్‌కు అనుకూలం. గవర్నర్ ప్రసంగాన్ని చంద్రబాబు సహా సభ్యులంతా విన్నారు.. అందుకు కారణం గవర్నర్ అంటే గౌరవం. కానీ ప్రస్తుత గవర్నర్ ప్రసంగాన్ని జగన్ సహా వైసీపీ సభ్యుల్లో ఒక్కరు కూడా వినలేదు. ఇది వాళ్లు గవర్నర్‌కు ఇచ్చే విలువ.

Also Read : ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్.. ఏం మాట్లాడతారో వింటా..!

ఓ వైపు మా అన్న తోపు, తురుము, మా అన్న సూపర్, డూపర్ అని వైసీపీ నేతలు ఎలివేషన్ ఇస్తుంటే.. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాత్రం.. తనదైన శైలిలో స్పందించారు. అసెంబ్లీ లాబీలో స్పీకర్ సరదా వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగం సందర్భంగా సభకు వచ్చి కాసేపు నిరసన తెలిపారన్నారు. 11వ తేదీ, 11 మంది సభ్యులు, 11 నిమిషాల పాటు మాత్రమే సభలో ఉండి వెళ్లిపోయారన్నారు. అంతకు మించి ఎక్కువ టైమ్ లేదనుకుంటా.. అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మొత్తానికి వైసీపీ మీడియా, సోషల్ మీడియా ఇచ్చిన ఎలివేషన్‌కు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా.. ఆ పార్టీ నేతలు వ్యవహరించిన తీరుకు ఏ మాత్రం పొంతన లేకపోవడంతో.. సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సెలవు పై ఐఏఎస్...

సీనియర్ ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్...

లోకేష్ డిన్నర్ మీట్.....

రాజకీయాల్లో నిలబడాలి అంటే.. ఎప్పటికప్పుడు సరికొత్తగా...

మ్యాచ్ అంటే ఇది.....

టి20 వరల్డ్ కప్ లో చిన్న...

ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్.....

ఏపీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్దమైంది....

జగన్ కు చెన్నకేశవ...

రాజకీయాల్లో వైఎస్ జగన్ ది విలక్షణ...

స్పీకర్ సంచలన నిర్ణయం..?...

ప్రజా సమస్యల పరిష్కారానికి చట్ట సభలు...

పోల్స్