Friday, June 12, 2026 05:51 PM
Friday, June 12, 2026 05:51 PM

ఈరోజు రాశి ఫలితాలు (11-06-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళ పక్షం.. 11-06-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

ఆప్తుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. దీర్ఘకాలిక ఋణాల నుండి విముక్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు లభిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

—————————————

వృషభం

ముఖ్యమైన వ్యవహారాలలో ఆత్మ విశ్వాసంతో పని చేసి లాభాలు అందుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. దాయాదులతో ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఆశించిన సహకారం అందుతుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశలు సద్వినియోగం చేసుకోవాలి.

—————————————

మిధునం

ఋణ ఒత్తిడి అధికమై మానసిక శిరో భాధలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. సంతాన విషయమై ఊహించని విషయాలు తెలుస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు కష్టం మీద పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

—————————————

కర్కాటకం

మిత్రులకు మీ అభిప్రాయాలు నచ్చే విధంగా ఉండవు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. కుటుంబ పెద్దలతో మాటపట్టింపులుంటాయి. ఇంటా బయట ఒత్తిడి వలన శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సివస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

—————————————

సింహం

బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్ధిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. వాహన అనుకూలత కలుగుతుంది. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

కన్య

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానలు అందుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రవర్తనకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

—————————————

తుల

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. శారీరక మానసిక సమస్యలు భాదిస్తాయి. ఉద్యోగమున విలువైన పత్రముల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. కుటుంబ విషయంలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. దైవ కార్యక్రమంలో పాల్గొనడం మంచిది.

—————————————

వృశ్చికం

నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

—————————————

ధనస్సు

కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

—————————————

మకరం

అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. సమయానికి నిద్రహారాలు ఉండవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి.

—————————————

కుంభం

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన బహుమతులు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి.

—————————————

మీనం

ఇంటా బయటా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఇంటా బయట వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కింగ్ పిన్ చుట్టూ...

వేల కోట్ల మద్యం కుంభకోణం, రవాణా...

బదిలీలపై నిషేధం తొలగిస్తారా..?

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల పై నిషేధం...

కేంద్ర మంత్రివర్గంలో జనసేన.....

కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్దం...

ముంబైలో బన్నీ ఇంటి...

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం...

గోపాలన్న కల ఈసారైనా...

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అంశం మళ్లీ...

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం..!

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమి...

పోల్స్