శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం.. 04-06-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..
మేషం
ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు. నూతన ప్రయత్నాలు ముందుకు సాగవు. బంధువుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ప్రయాణాలలో మార్పులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది.
—————————————
వృషభం
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. సంతానానికి నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
—————————————
మిధునం
ముఖ్య కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగడం మంచిది కాదు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి.
—————————————
కర్కాటకం
ప్రయాణాలలో కొత్త పరిచయాలు భవిష్యత్తుకు సహాయపడతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
—————————————
సింహం
ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సేవాకార్యక్రమాలు చేపడతారు. స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో రాజీ చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగాలలో విలువైన పత్రాలు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
—————————————
కన్య
దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
—————————————
తుల
నిరుద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తులాభాలు పొందుతారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి కొంత ఉపశమనం పొందుతారు.
—————————————
వృశ్చికం
మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. దూర ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణయత్నాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీకు రావలసిన గుర్తింపు వేరే వారికి వస్తుంది.
—————————————
ధనస్సు
దీర్ఘకాలిక ఋణాల ఒత్తిడి పెరుగుతుంది. అనుకున్న పనుల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత చికాకు తప్పదు. ఆరోగ్యసమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్పదు. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.
—————————————
మకరం
నూతన పరిచయాలు సంతోషాన్నిస్తాయి. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి. గృహమున బందు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.
—————————————
కుంభం
ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి ధన సహాయం అందిస్తారు. చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
—————————————
మీనం
సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల కొంత చికాకు పెరుగుతుంది. పని ఒత్తిడి అధికమై శిరో బాధలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
—————————————
గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

