Saturday, September 19, 2026 07:22 AM
Saturday, September 19, 2026 07:22 AM

బాలయ్య ఫ్యాన్స్ కు తమన్ అదిరిపోయే గిఫ్ట్.. బాక్సులు బద్దలే..!

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అంటే ఓ రేంజ్ ఉంటుంది. వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పటి వరకు మూడు సినిమాలు రాగా ఇప్పుడు మరో సినిమా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. సింహ, లెజెండ్, అఖండ సూపర్ హిట్ లు అయ్యాయి. ఇప్పుడు అఖండ 2 వస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ కాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్ కు మరో హైలెట్ కూడా ఉంది. అదే తమన్.. అఖండ సినిమాతో ఓ ఊపు ఊపాడు తమన్.

Also Read : విజయ్ కు ఎన్డీయే ఆఫర్లు ఇవే..?

అక్కడి నుంచి బాలయ్య కోసం తమన్ అందించే మ్యూజిక్ మరో హైలెట్ అవుతోంది. బాలకృష్ణ సినిమా అంటే ప్రాణం పెట్టి కొట్టే తమన్.. ఇప్పుడు అఖండ 2 విషయంలో అదే రేంజ్ లో వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమా మ్యూజిక్ వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఈ టైం లో ఓ న్యూస్ బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. అసలు ఏంటీ ఆ న్యూస్ అనేది ఒకసారి చూద్దాం. పూర్తిగా ఆధ్యాత్మిక కోణంలో వస్తోన్న ఈ సినిమాలో ఆధ్యాత్మిక స్పర్శను మరింత కలిగించేందుకు తమన్‌ ప్రత్యేకంగా ప్లాన్ చేసాడు.

Also Read : యువతకు ఏం కావాలో తేల్చేసిన పవన్..!

సంస్కృత శ్లోకాలు, వేదమంత్రాలు చెప్పడంలో ప్రముఖులుగా పేరు తెచ్చుకున్న పండిట్‌ శ్రవణ్‌ మిశ్రా, పండిట్‌ అతుల్‌ మిశ్రా సోదరులను అఖండలో భాగం చేసాడు. దీనికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు హైలెట్ కాబోతున్నాయని ముందు నుంచి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ యాక్షన్ సీన్స్ కు వీళ్లు పఠించే శ్లోకాలు సినిమాను మరో లెవెల్ కు తీసుకువెళ్ళడం ఖాయంగా చెప్తున్నారు ఫ్యాన్స్. కాగా ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్