Sunday, October 18, 2026 10:05 AM
Sunday, October 18, 2026 10:05 AM

ఉగ్రవాదులతో ఉలిక్కిపడిన రాయలసీమ

దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యాకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పహల్గాం దాడి తర్వాత దక్షినాదిలో ఉగ్రవాద కార్యకలాపాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల విజయవాడలో ఉగ్రవాదులు ఉన్నారనే ఓ వార్త ప్రజలని భయపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజయవాడ కానూరు సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న విదేశీయులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక విజయనగరంలో కూడా పేలుళ్లకు పాల్పడాలి అని ప్లాన్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు పేలుళ్లకు పాల్పడటంతో నైపుణ్యం సంపాదించినట్లు విచారణలో వెల్లడైన సంగతి కూడా తెలిసిందే.

Also Read : ముందు ఆ విషయం పై క్లారిటీ ఏదీ..?

ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో కూడా ఉగ్రవాదుల కదిలికల గురించి ఆందోళన మొదలైంది. ఉగ్రవాద నెట్వర్క్ ను పోలీసులు బయటకు లాగారు. రాయచోటిలో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు సోదరులను అదుపులోకి తీసుకున్న ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు.. రహస్య ప్రచారంలో విచారిస్తున్నట్టు సమాచారం. చెన్నె ఐబీ పోలీసుల అదుపులో అబూబకర్ సిద్ధిఖీ, మహమ్మద్ అలీ ఉన్నట్టు తెలుస్తోంది. కోయంబత్తూరు పేలుళ్ల కుట్ర పతక రచన కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు అని భావిస్తున్నారు.

Also Read : దుబారాలో పరాకాష్ట.. ఇదేందయ్యా..!

అప్పట్లో అడ్వాణీ రథయాత్ర సందర్భంగా పేలుళ్లకు కుట్ర పన్నినట్టు గుర్తించారు. 1995లో కోయంబత్తూరు బాంబు పేలుళ్ల కేసుల్లోనూ ఇద్దరు నిందితులుగా భావించినట్టు తెలుస్తోంది. 30 ఏళ్లుగా రాయచోటిలో మారుపేర్లతో చీరల వ్యాపారం చేస్తున్న సోదరుల ఇంట్లో తీవ్రవాద కార్యకలాపాల పుస్తకాలు, సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంతో ఒక్కసారిగా రాయలసీమ ఉలిక్కిపడింది. వీరికి స్థానికులు ఎవరైనా సహకరిస్తున్నారా అనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. వీరి బంధువులను కూడా విచారించే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తిరువూరు కూటమిలో అసమ్మతి.....

కూటమిలో కుంపటి రాజేశారు. తొలి నుంచి...

Garividi Lakshmi Review:...

ఉత్తరాంధ్ర జానపద కళాసంప్రదాయంలో తనకంటూ ప్రత్యేక...

రాయచోటిలో ఆయుధాలతో పంజాబ్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

హోం మంత్రి పదవి...

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి...

ఓటమి భయంతోనే దాడులు

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని...

సాక్ష్యాలతో కడిగిపారేసిన ఈడీ.....

మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయి...

పోల్స్