Saturday, September 19, 2026 01:30 PM
Saturday, September 19, 2026 01:30 PM

ప్రముఖ ఛానల్ చైర్మన్ తాట తీస్తున్న రేవంత్ సర్కార్..?

రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు ఇతర ప్రముఖుల విషయంలో.. మీడియా చేసే అతి అంతా ఇంతా కాదు. లేని పోనీ ప్రచారం చేస్తూ హడావుడి మొదలుపెట్టి.. వాళ్ళే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తూ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ ఉంటారనే ఆరోపణ మనం వింటూనే ఉంటాం. ఆ చేష్టలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు తెలంగాణా మంత్రి, ఓ ఐఏఎస్ మహిళా అధికారిపై ఇదే విధంగా ప్రచారం చేసింది ఓ న్యూస్ ఛానల్. ఐఏఎస్ తో మంత్రి ప్రేమలో పడ్డాడు అంటూ కథనం రాసింది.

Also Read : ఆ జిల్లా నేతలపై చంద్రబాబు గుర్రు..!

దీనికి బీఆర్ఎస్ అనుకూల వెబ్ సైట్ లు అన్నీ కూడా వంత పాడాయి. యూట్యూబ్ చానల్స్ లో హడావుడి చేయడం మొదలుపెట్టారు. దీనితో ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ప్రచారం చేసిన ప్రముఖ న్యూస్ ఛానల్ ఎన్టీవీ పై గురి పెట్టారు పోలీసులు. మహిళా ఐఏఎస్‌ అధికారిని కించపరిచేలా వార్త ప్రసారం చేసిన కేసును సీరియస్ గా తీసుకుని.. వారిపై నిఘా పెట్టారు.

Also Read : టీటీడీపై ఫారెనర్‌ వ్యాఖ్యలు.. నెట్టింట వైరల్..!

తాజాగా ఛానెల్‌ ఇన్‌పుట్‌ ఎడిటర్‌, ఇద్దరు రిపోర్టర్లను సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్ చేసారు. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తుండగా ఇన్‌పుట్‌ ఎడిటర్‌ ను అరెస్ట్ చేసారు. కించపరిచే వార్తలు ప్రసారం చేసిన పలువురిని గుర్తించిన పోలీసులు.. 44 యూట్యూబ్‌ ఛానెల్స్‌పై చర్యలకు సిద్ధమయ్యారు. పోలీసుల చర్యలతో పలు యూట్యూబ్‌ ఛానెల్స్‌ నిర్వాహకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇప్పటికే ఈ కేసుపై సిట్‌ ఏర్పాటుచేసి దర్యాప్తు చేయిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఛానల్ సీఈఓ, చైర్మన్ ను అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనితో ఆ ఇద్దరూ పరారీలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరూ దేశం దాటినట్టు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్