Thursday, February 26, 2026 04:03 AM
Thursday, February 26, 2026 04:03 AM

వైసీపీ నేతకు టీడీపీ పదవి.. అంతా గందరగోళం..!

తెలుగుదేశం పార్టీలో పదవుల కేటాయింపు కొంత విమర్శలకు తావిస్తోంది. కొందరికి పదవుల కేటాయింపు విషయంలో టీడీపీ అధినాయకత్వం తప్పులు చేస్తోందనే మాట బాగా వినిపిస్తోంది. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన వారిని కాదని.. కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. జిల్లాల వారీగా స్థానిక నేతల సిఫారసుతో జిల్లా కమిటీలను ఎంపిక చేస్తున్నారు. అయితే ఈ పదవుల కేటాయింపు ప్రభావం ఇప్పుడు అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై పడుతోంది.

తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనే కంటే.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే.. తెలుగు తమ్ముళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే టార్గెట్ టీడీపీ అన్నట్లుగా దాడులు జరిగాయి. పల్నాడు ప్రాంతంలో ఊర్లోకి రాకుండా ఏకంగా గోడ కట్టేశారు. ఇక టీడీపీ నేతలను ఊరు వదిలి వెళ్లిపోవాలని.. లేదంటే చస్తారంటూ బెదిరింపులు కూడా చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి వంటి నేతల ఇళ్లపైనే దాడులు జరగటంతో.. చాలా మంది నేతలు, కార్యకర్తలు ఊర్లు వదిలేసి వెళ్లిపోయారు. ఇక తోట చంద్రయ్య లాంటి బీసీ నాయకుడిని నడిరోడ్డుపై గొంతు కోసి మరీ హత్య చేశారు వైసీపీ గూండాలు.

Also Read : ఆపరేషన్ సిందూర్ టార్గెట్ పాక్ ప్రధాని.. ట్రంప్ సంచలనం..!

2024 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తెలుగు తమ్ముళ్లు తెగించి పని చేశారు. అందుకే కూటమి పార్టీలో ఏకంగా 164 సీట్లు గెలుచుకున్నాయి. అయితే ఇక్కడే టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. మరి వారు నేతలకు ఎందుకు నచ్చారో తెలియదు కానీ.. వారికే కీలక పదవులు ఇస్తున్నారు స్థానిక నేతలు. తాజాగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షునిగా జన్నథ్ హుస్సేన్‌ను ఎంపిక చేశారు. ఈ ఎంపిక ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకల దాడిలో జన్నథ్ ఉన్నాడని.. వైసీపీ నేత పానుగంటి చైతన్యకు జన్నథ్ ముఖ్య అనుచరుడు అని ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై టీడీపీ నేతలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలుగు యువతగా మైనారిటీకి చెందిన జన్నథ్‌కు ఇవ్వడాన్ని రకరకాల ట్రోల్ చేస్తున్నారన్నారు. అపోహలకు తావిస్తున్నారని వ్యాఖ్యానించారు. విమర్శలు చేసే ముందు స్థానిక నేతల నుంచి వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో జన్నథ్ టీడీపీలోనే ఉన్నాడని.. అందుకు సాక్షిపత్రికలో వచ్చిన ఫోటోలే సాక్ష్యమంటున్నారు. అక్టోబర్‌లో దాడి జరిగితే.. నవంబర్‌ 13న వైసీపీలో చేరాడని గుర్తు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి తర్వాత జరిగిన ధర్నాలు, నిరసనల్లో జన్నథ్ పాల్గొన్నాడని.. అది సహించలేకనే వైసీపీ పేటీఎం బ్యాచ్ జన్నథ్ మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారన్నారు. అప్పటికి అతనికి నిశ్చితార్థం మాత్రమే జరిగిందని.. పెళ్లి కూడా జరగలేదన్నారు. పెళ్లి కాదేమో అనే భయంతో గత్యంతరం లేకనే వైసీపీలో చేరాడన్నారు. ఎన్నికలకు ఏడాది ముందే టీడీపీలోకి తిరిగి వచ్చాడని.. ఎన్నికల్లో గుంటూరు వెస్ట్, తాడికొండ నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు కోసం పని చేశాడంటున్నారు. తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు.

Also Read : జగన్ ను తిట్టోద్దని పవన్ చెప్పారా..?

అయితే టీడీపీ నేతల వివరణపై కూడా ఇప్పుడు కౌంటర్లు వస్తున్నాయి. 2025 డిసెంబర్ 21న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో జన్నథ్ పాల్గొన్నాడని ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. తాడికొండ వైసీపీ ఇంఛార్జ్ డైమండ్ బాబు నిర్వహించిన వేడుకల్లో జన్నథ్ తండ్రి, కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారని.. 2024 కంటే ముందు జన్నథ్‌కు పార్టీ సభ్యత్వం కూడా లేదని.. అతనిపై గంజాయి, చీటింగ్ కేసులు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. కన్సల్టెన్సీ పేరుతో గుంటూరులో రూ.6 కోట్లు స్కామ్ చేసిన జన్నథ్‌కు తెలుగు యువత అధ్యక్షునిగా ప్రమోషన్ వచ్చిందంటూ విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సీఎంఓలో ఆ ఇద్దరు...

సీఎం కార్యాలయంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న...

జూన్ 15 ముహుర్తం.....

"జూన్ 15వ తేదీన మళ్లీ వస్తా.....

జగన్ ను తిట్టోద్దని...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కల్తీ లడ్డు వ్యవహారంపై...

అందరి జాతకాలు బయటపెడతా..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్...

ప్లాన్ ప్రకారమే అంతా.....

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

తిరుమల పవిత్రతకు ప్రత్యేక...

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిరక్షణపై...

పోల్స్