Wednesday, May 6, 2026 10:49 PM
Wednesday, May 6, 2026 10:49 PM

సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త సరికొత్త రికార్డు.. కారణమేంటి?

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్యంత ఘనంగా జరుగుతోంది. గతంలో 60 లక్షల సభ్యత్వాలు నమోదు అయితే ఈసారి ఏకంగా 73 లక్షలు సభ్యత్వాలు దాటాయి. దీనితో తెలుగుదేశం పార్టీ అధిష్టానం అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా కనపడుతున్నారు. అయితే ఈ స్థాయిలో సభ్యత్వాలు జరగడానికి ప్రధాన కారణం ఏంటి అనేదానిపై ఇప్పుడు రాజకీయ పరిశీలకులు పలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఫ్యూచర్ లో కూడా ఏకగ్రీవమే… బీటెక్ రవి స్ట్రాంగ్ వార్నింగ్

దీని వెనుక కారణాలు ఒకసారి చూస్తే గత ఐదేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం లో చాలా మందిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. వ్యాపార పరంగా, వ్యక్తిగతంగా అలాగే తెలుగుదేశం పార్టీకి సహకరిస్తున్నారనే కారణంతో వేధింపులకు గురి చేశారు. తెలుగుదేశం పార్టీకి సహకారం అందిస్తున్నారు లేదా సోషల్ మీడియాలో ఆ పార్టీకి మద్దతుగా పోస్ట్ లు పెడుతున్నారనే అనుమానం వచ్చినా సరే.. అప్పట్లో అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. దీనితో ఇప్పుడు వారందరూ కూడా జగన్ పై కోపంతో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

అదేవిధంగా కొన్ని సామాజిక వర్గాలను జగన్ లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులు పెట్టారు. తెలుగుదేశం పార్టీకి సాలిడ్ ఓటు బ్యాంకు ఉంటుంది అనుకుని భావించిన ప్రతీ సామాజికవర్గాన్ని జగన్ టార్గెట్ చేశారు. వాస్తవానికి వీరిలో చాలామంది తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడమే మినహా బయటికి వచ్చి జెండా పట్టుకునే పరిస్థితి ఉండదు. కానీ ఈసారి మాత్రం వాళ్ళందరూ సభ్యత్వాలు నమోదు చేసుకున్నారు. అలాగే 2004 తర్వాత తెలుగుదేశం పార్టీని అభిమానించే యువత తగ్గుతూ వచ్చారు. ఫీజు రియంబర్స్ మెంట్ ప్రభావం టీడీపీపై పడింది అని చెప్తారు.

Also Read: టాలీవుడ్ రేవంత్ ను తక్కువ అంచనా వేసిందా..?

కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వాళ్లు పార్టీ జెండా పట్టుకున్న పరిస్థితులు చాలా తగ్గాయి. అయితే 2024 తర్వాత జగన్ కారణమో మరేదైనా కారణమో తెలియదు గాని తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు భారీగా నమోదయ్యాయి. వీరిలో ఎక్కువగా యువతే కనపడుతున్నారు. అలాగే కొత్తగా ఉద్యోగాల్లో జాయిన్ అయిన వారు వైసీపీ నుంచి బయటకు వచ్చి జగన్ తో విభేదించిన చాలామంది యువకులు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అటు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం భారీగా నమోదయింది.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో తెలంగాణలో కూడా పార్టీ కార్యకర్తలు చాలా సంతోషంగా కనబడుతున్నారు. దీనితో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ ఎత్తున సభ్యత్వాలు నమోదయ్యాయి. గతంలో రాయలసీమ ప్రాంతంలో సభ్యత్వాలు తక్కువగా ఉండేవి అనే అభిప్రాయం ఉండేది. కానీ ఈసారి కడప, చిత్తూరు జిల్లాలో కూడా భారీగా సభ్యత్వాలు నమోదు కావడం గమనారం. కర్నూలు, ప్రకాశం జిల్లాలో కూడా సభ్యత్వాల సంఖ్య భారీగా పెరిగింది.

Also Read: వైసీపీ కామెడి.. అల్లు అర్జున్ మాత్రమే మనిషా..? 5 ఏళ్ళ పాపాలు మరిచారా..?

తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పెరగడానికి రాజధానిగా అమరావతి కొనసాగించడం కూడా మరో కారణమనే అభిప్రాయం ఉంది. చంద్రబాబు చెప్పినట్టుగా అమరావతి పనులు తిరిగి మొదలు కావడం పట్ల తెలుగుదేశం పార్టీ విషయంలో చాలామంది సానుకూలంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తు వెతుక్కునే వారు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారు. వారందరూ ఆ పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఐదు లక్షల ప్రమాద బీమా కూడా పార్టీ అందిస్తోంది. దీనితో సభ్యత్వాల సంఖ్య భారీగా పెరిగినట్లుగా అర్థమవుతుంది.

అయితే వీరిని తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు వాడుకోకుండా, వారికి కష్టాలు వచ్చినప్పుడు నిలబడితే భవిష్యత్తులో అధికారం కోల్పోయినా సరే వారికి అండగా నిలబడితే అధికారంలో ఉన్నప్పుడు వారి వ్యక్తిగత, ఆర్ధిక, సామాజిక అభివృద్ధికి సహకరిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మరో 30 ఏళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉండకపోవచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్