Wednesday, May 6, 2026 11:36 PM
Wednesday, May 6, 2026 11:36 PM

చంద్రబాబు తలనొప్పిగా మారిన ఎమ్మెల్యేలు

ఏపీలో గత అయిదేళ్ళ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొంటూ తెలుగుదేశం పార్టీ ధీటుగా నిలబడింది. తెలంగాణాలో అయితే గత 20 సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినా ఇంకా పోరాడుతోంది. రాజకీయంగా వైసీపీ ఎన్ని రకాల సమస్యలు సృష్టించినా సరే వాటిని ఎదుర్కొంటూ చంద్రబాబు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. పార్టీ నేతల మీద అక్రమ కేసులు పెట్టినా, తనను జైల్లో పెట్టినా చంద్రబాబు తట్టుకుని నిలబడ్డారు. అలాంటి చంద్రబాబుకు పార్టీ నేతల వైఖరి ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఎమ్మెల్యేల వైఖరి ఒక సమస్య అయితే కొందరు ఎమ్మెల్యేల బంధువులు, భర్తలు, భార్యలు అనుసరిస్తున్న వైఖరిపై చంద్రబాబు చికాకుగా ఉన్నారు.

ఒకపక్క ప్రభుత్వాన్ని ఈ పరిస్థితిలో నడపడం పెద్ద సమస్య అయితే ఎమ్మెల్యేల వ్యవహారశైలి తలనొప్పిగా మారింది. తాజాగా ఏపీ కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొన్నింటిని రద్దు కూడా చేసింది ప్రభుత్వం. ఇక ఈ సందర్భంగా ఏపి క్యాబినెట్ లో మంత్రులతో సిఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల, ప్రవర్తన కారణం ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచిపేరు దెబ్బతింటోందని మంత్రుల ముందే ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేపర్ల నిండా వారు చేసిన పొరపాట్లను ప్రస్తవిస్తూ వార్తలు వస్తున్నాయని… దీని వల్ల అందరికి చెడ్డ పేరు వస్తోందని మండిపడ్డారు చంద్రబాబు. మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి.. మీ జిల్లాలోని ఎమ్మెల్యేలు నాయకులను మీరే గైడ్ చేయాలని సూచించారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన భాద్యత మంత్రులది, ఎమ్మెల్యేలదని చంద్రబాబు స్పష్టం చేసారు. ప్రభుత్వంలో కీలక మైన సమాచారం బయటకు పోతోందని శ్వేత పత్రాల్లో సమాచారం ఓటాన్ అకౌంట్ వివరాలు, ఇతర కీలకమైన నిర్ణయాలు బయటకు పొక్కడం పై చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో వైసిపి వేగులు ఉన్నారన్న అంశం విస్తృతంగా చర్చ జరిగింది. ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన ముఖ్యమన్న కొందరు మంత్రులు అభిప్రాయపడగా… త్వరలోనే నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్